/rtv/media/media_files/2026/02/19/subsea-cables-2026-02-19-16-01-19.jpg)
What are subsea cables and why Google's India-US route matters
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగం రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. దీంతో డేటా వినియోగం విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 వేదికగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కీలక ప్రకటన చేశారు. అమెరికా ఇండియా కనెక్ట్(AIC) అనే సబ్‌సీ కేబుల్ (సముద్ర గర్భ కేబుల్) ప్రాజెక్టు గురించి వెల్లడించారు. దాదాపు 15 బిలియన్ డాలర్ల (రూ.1.25 లక్షల కోట్లు) పెట్టుబడితో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఏపీలోని వైజాగ్ కూడా కీలక హబ్‌గా మారనుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యుగంలో డేటా వినియోగం విపరీతంగా పెరుగుతున్న వేళ, టెక్ దిగ్గజం గూగుల్ ఒక భారీ ప్రాజెక్టును ప్రకటించింది. 'AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026' వేదికగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ 'అమెరికా-ఇండియా కనెక్ట్' (AIC) అనే ప్రతిష్టాత్మక సబ్‌సీ కేబుల్ (సముద్ర గర్భ కేబుల్) ప్రాజెక్టును వెల్లడించారు. సుమారు 15 బిలియన్ డాలర్ల (దాదాపు ₹1.25 లక్షల కోట్లు) పెట్టుబడితో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం (వైజాగ్) అంతర్జాతీయ ఇంటర్నెట్ మ్యాప్‌లో కీలక కేంద్రంగా మారనుంది.
Also Read: మత విద్వేషానికి మానవత్వం బ్రేక్‌లు.. మొన్న దీపక్, నిన్న కోవాబన్ వలీ
సబ్‌సీ కేబుల్స్ అంటే?
సబ్‌సీ కేబుల్స్‌ను తెలుగులో సముద్ర గర్భ కేబుల్స్ అని అంటారు. ఇవి ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్. దాదాపు అంతర్జాతీయ ఇంటర్నెట్ ట్రాఫిక్ అంతా కూడా సముద్రం అడుగున వేసిన ఈ కేబుల్స్ ద్వారానే ప్రయాణిస్తాయి. మనం వాడే ఇంటర్నెట్ అంతా శాటిలైట్ల ద్వారా వస్తుందని చాలామంది భావిస్తారు. నిజానికి 99 శాతం అంతర్జాతీయ ఇంటర్నెట్ ట్రాఫిక్ ఈ కేబుల్స్ ద్వారానే జరుగుతుంది. మనం పంపించే ఈమెయిల్స్, వీడియో కాల్స్ నుంచి క్లౌడ్ కంప్యూటింగ్ దాకా ప్రతిదీ కూడా ఈ కేబుల్స్ గుండానే ప్రయాణిస్తుంది. శాటిలైట్లతో పోలిస్తే ఇవి చాలా వేగంగా, తక్కువ ఖర్చుతో డేటాను ట్రాన్స్ఫర్ చేస్తాయి.
ఎలా పనిచేస్తాయి ?
లావుగా ఉండే ఈ కేబుల్స్ లోపల వెంట్రుకలంత సన్నని ఆప్టికల్ ఫైబర్స్ ఉంటాయి. ఇవి లేజర్ కాంతి రూపంలో డేటాను రవాణా చేస్తుంటాయి. సముద్రపు ఒత్తిడిని, షిప్పుల యాంకర్లను తట్టుకోని ఉండేలా వీటికి స్టీల్, కాపర్, ప్లాస్టిక్ పొరలతో రక్షణ ఉంటుంది. ప్రతి 100 కిలోమీటర్లకు ఒకసారి 'రిపీటర్లు' ఉండి సిగ్నల్ తగ్గకుండా వేలాది కిలోమీటర్ల దూరం డేటాను ప్రయాణించేలా చేస్తాయి.
ఇప్పటిదాకా భారత్‌లో ముంబై, చెన్నై నగరాలే ప్రధాన ఇంటర్నెట్ ల్యాండింగ్ ప్రాంతాలుగా ఉన్నాయి. తాజగా గూగుల్ తన AIC ప్రాజెక్టులో భాగంగా వైజాగ్‌ను కూడా మూడొ ప్రధాన హబ్‌గా మార్చనుంది.
లాభాలు
విశాఖపట్నాన్ని కూడా ఇంటర్నెట్ ల్యాండింగ్ హబ్‌గా చేయడం వల్ల ముంబై, చెన్నైపై ఒత్తిడి తగ్గుతుంది. ఏదైనా టెక్నికల్ సమస్య వచ్చినా ఇంటర్నెట్ ఆగకుండా వైజాగ్ మార్గం ద్వారా డేటా అందుతుంది. డేటా బదిలీ చేయడంలో జాప్యం తగ్గుతుంది. గేమింగ్, AI అప్లికేషన్లు అత్యంత వేగంగా పనిచేస్తాయి.
వైజాగ్ నుండి మూడు దిశల్లో ఇంటర్నెట్ కేబుల్స్
1.వైజాగ్-సింగపూర్: ఇక్కడి నుంచి ఆస్ట్రేలియా మీదుగా అమెరికా పశ్చిమ తీరానికి అనుసంధానిస్తారు.
2.వైజాగ్ - చెన్నై: ఈ ప్రాంతం నుంచి దక్షిణాఫ్రికా మీదుగా అమెరికా తూర్పు తీరానికి కనెక్ట్ చేస్తారు.
3.వైజాగ్ - ఆస్ట్రేలియా: దక్షిణార్ధగోళం (Southern Hemisphere) దేశాల మధ్య ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేస్తాయి.
Also Read: రైల్వేశాఖ సంచలన నిర్ణయం.. టాయిలెట్లలో ఆ సమస్యకు చెక్
భారత్‌లో 100 కోట్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. భవిష్యత్తులో ఏఐ ట్రైనింగ్, క్లౌడ్ సేవల కోసం భారీ బ్యాండ్‌విడ్త్ అవసరం అవుతుంది. గూగుల్ నిర్మిస్తున్న ఈ భారీ గేట్‌వే, గిగావాట్ స్థాయి కంప్యూటింగ్ సదుపాయం భారత్‌ను గ్లోబల్ డిజిటల్ లీడర్‌గా నిలబెట్టనున్నాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఈ కేబుల్స్ రాబోయే రోజుల్లో భారత్-అమెరికా మధ్య డిజిటల్ బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి. అలాగే లక్షలాది మందికి ఏఐ ఏఐ నైపుణ్య శిక్షణలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి.
Follow Us