/rtv/media/media_files/2026/04/29/west-bengal-elections-2026-04-29-17-05-41.jpg)
West bengal Elections
పశ్చిమ బెంగాల్(West Bengal Election 2026) లో రెండో విడత పోలింగ్ ముగిసింది. ఏప్రిల్ 23న మొదటి విడత ముగియడంతో ఏప్రిల్ 29న రెండో దశ ఎన్నికలు జరిగాయి. 294 స్థానాలున్న వెస్ట్ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (TMC), భారతీయ జనతా పార్టీ (BJP) మధ్య ప్రధాన పోటీ ఉంది. ఈ పార్టీల బలాలు, బలహీనతలు ఏంటో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
TMC బలాలు:
1. మమతా బెనర్జీ ఇమేజ్, మూడుసార్లు సీఎంగా పనిచేసిన అనుభవం
2. మహిళల కోసం ప్రవేశపెట్టిన 'లక్ష్మీ భండార్' , 'కన్యాశ్రీ' లాంటి పథకాల వల్ల మహిళా ఓటర్ల సపోర్ట్
3. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పటిష్టమైన కేడర్ వ్యవస్థ
4. ముస్లిం ఓట్ బ్యాంక్ సపోర్ట్
5. బీజేపీని "బయటి వ్యక్తుల పార్టీ" (Outsiders) గా చిత్రీకరిస్తూ, తాము బెంగాలీ అస్థిత్వాన్ని కాపాడుతామని ప్రచారం చేయడం
6. 'దువారే సర్కార్' లాంటి వినూత్న కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ సేవలను నేరుగా ఇంటికే చేర్చడం.
7. రైతులకు ఆర్థిక సాయం అందించే పథకాల వల్ల గ్రామీణ స్థాయిలో బలం
8. టీఎంసీ సోషల్ మీడియా యాక్టివ్ ఉండటం, ప్రతిపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టడం
Also Read : కేరళ ఓటర్లు ఏటు వైపు ?.. కూటముల వ్యూహాలు ఫలించేనా..
బలహీనతలు:
1.టీచర్స్ రిక్రూట్‌మెంట్ స్కామ్, రేషన్ కుంభకోణం లాంటి ఆరోపణలు, పార్టీ అగ్రనేతలు జైలుకు వెళ్లడం
2. మహిళలపై అత్యాచార ఘటనలు పెరగడంతో ప్రభుత్వంపై విమర్శలు
3. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల నుంచి స్థానిక నాయకులు కమీషన్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు
4. హిందూ ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ ఓటు శాతం పెరగడం
5. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు రాకపోవడం వల్ల నిరుద్యోగ యువతలో నిరాశ
6. కేంద్ర సంస్థలైన CBI, ED వరుసగా చేస్తున్న విచారణల వల్ల దెబ్బతినడం
7. 15 ఏళ్లుగా అధికారంలో ఉండటం వల్ల ప్రజల్లో అసంతృప్తి
8. పార్టీలో అధికారమంతా మమతా, పార్టీ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీల వద్దే ఉంటుదనే విమర్శ
BJP బలాలు:
1. ప్రధాని మోదీ ఇమేజ్, ఆయన సభలకు వచ్చే భారీ జనసందోహం పార్టీకి ప్రధాన బలం
2. సందేశ్‌ఖాలీ, RG కర్ మెడికల్ కాలేజీ ఘటనలను ప్రస్తావిస్తూ మహిళల ఆత్మగౌరవం, భద్రతను ప్రధాన ఎన్నికల అంశాలుగా మార్చడం
3. మహిళలకు నెలకు రూ.3,000 ఆర్థిక సాయం, ఉచిత బస్సు ప్రయాణం లాంటి హామీలు ఇవ్వడం
4. 'పన్నా ప్రముఖ్' వ్యవస్థ ద్వారా ప్రతి 30-60 మంది ఓటర్లను పర్యవేక్షించేలా పటిష్టమైన యంత్రాంగాన్ని సిద్ధం చేయడం
5. ఈసారి TMC నుంచి వచ్చిన వాళ్లకన్నా, పార్టీకి విధేయులుగా ఉన్న పాత కార్యకర్తలకు, క్లీన్ ఇమేజ్ ఉన్నవాళ్లకు టికెట్లు ఇవ్వడం
6. వందే భారత్ రైళ్లు, జాతీయ రహదారుల నిర్మాణం లాంటి కేంద్ర ప్రాజెక్టులను తమ అభివృద్ధి ఎజెండాగా చూపించడం
7. బంగ్లాదేశీయులు అక్రమంగా బెంగాల్‌లో చొరబడతున్నారని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం
8. బీజేపీ నేతలు బెంగాలీలో మాట్లాడుతూ ప్రజలకు దగ్గరవ్వడం
Also Read : 100% ముస్లిం ఓటర్లున్న వార్డులో హిందూ మహిళ ఘనవిజయం!
బలహీనతలు:
1. బలమైన ముఖ్యమంత్రి అభ్యర్థి లేకపోవడం
2. మైనార్టీల మద్దతు శూన్యం
3.పదేళ్లుగా అమల్లో ఉన్న TMC పథకాల లబ్ధిదారులను తమ వైపు మళ్లించడం అంత సులభం కాకపోవడం
4.పాత బీజేపీ నేతలు, ఇతర పార్టీల నుండి వచ్చిన నేతల మధ్య విభేదాలు
5. గ్రామీణ ప్రాంతాల్లో కేడర్ వ్యవస్థ బలహీనంగా ఉండటం
6. నిత్యావసరాల ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యల వల్ల కేంద్రపై విమర్శలు
7. కొన్ని చోట్ల లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి ఓట్లను చీల్చి బీజేపీకి నష్టం కలిగించే ఛాన్స్
Follow Us