BIG BREAKING: కాసేపట్లో డీలిమిటేషన్‌పై ఓటింగ్.. ఎవరి బలం ఎంతంటే ?

లోక్‌సభలో ఈరోజు కీలక ఘట్టం చోటుచేసుకోనుంది. 131వ రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లులపై మరికాసేపట్లో ఓటింగ్ జరగనుంది.

New Update
Voting on three bills in Lok Sabha soon

Voting on three bills in Lok Sabha soon

లోక్‌సభలో ఈరోజు కీలక ఘట్టం చోటుచేసుకోనుంది. 131వ రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లులపై మరికాసేపట్లో ఓటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఓటింగ్‌కు ముందు అధిరాక, విపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అయిత్ ఈ ఓటింగ్ ప్రక్రియను విజయవంతం చేసేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. తన కార్యాలయంలో సీనియర్ మంత్రులతో అత్యవసరంగా భేటీ అయ్యారు. 

Also Read: రిజర్వేషన్‌ బిల్లు మహిళల సాధికారత కోసం తెచ్చింది కాదు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

ఎన్డీయే కూటమి సభ్యులందరూ సభకు హాజరయ్యేలా చూడటం, బిల్లులపై తలెత్తే అభ్యంతరాలను ఎలా ఎదుర్కోవాలో మీటింగ్‌లో దిశానిర్దేశం చేశారు. అయితే ఈ బిల్లులను విపక్ష ఇండియా కూటమి అడ్డుకునేందుకు యత్నిస్తోంది. కాంగ్రెస్‌ అగ్రనేతలు ప్రియాకం గాంధీ, కేసీ వేణుగోపాల్‌ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాతో సమావేశమై మాట్లాడారు. ఆ తర్వాత విపక్ష కూటమి నేతలందరూ కలిసి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మరోవైపు డీలిమిటేషన్ బిల్లును ఓడిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. చిన్న పార్టీలను  కూడా తమవైపు తిప్పుకునేందుకు విపక్ష పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

Also Read: రామలక్ష్మణులు వలస కూలీలు.. ప్రకాశ్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు

సభలో ఈ బిల్లులపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలంగించేందుకు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కూడా విపక్ష నేతలతో సంప్రదింపులు చేస్తున్నారు. అయితే దేశ రాజకీయ భవిష్యత్తుకు ఈ బిల్లులు కీలకమని కేంద్రం వాదిస్తోంది. మరోవైపు ప్రధాని మోదీ కూడా ఈ చారిత్రక బిల్లులకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలాఉండగా లోక్‌సభలో ఈ బిల్లులు ఆమోదం పొందాలంటే 2/3 వంతు మెజార్టీ అవసరం. అంటే మొత్తం 540 ఎంపీలు ఉండగా 360 ఓట్లు కావాలి. ప్రస్తుతం NDAకు 293 ఎంపీల బలం ఉండగా.. విపక్ష పార్టీలకు 234 మంది ఎంపీల బలం ఉంది. ఈ బిల్లులు ఆమోదం పొందేందుకు కేంద్రానికి ఇంకా 67 ఓట్లు కావాలి. మరీ ఈ బిల్లులు లోక్‌సభలో ఆమోదం పొందుతాయే? లేదో? తెలియాలంటే మరికొన్ని గంటలు వేచిచూడాల్సిందే.  

Advertisment
తాజా కథనాలు