TVK Vijay: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం.. కింగ్‌ మేకర్‌గా మారనున్న విజయ్..

తమిళనాడు రాజకీయాల్లో  తమిళగ వెట్రి కజగం (TVK) చీఫ్‌ విజయ్ ఇప్పుడు కీలకంగా మారారు. ఈ ఎన్నికల్లో ఆయన కింగ్ మేకర్‌గా మారే అవకాశం ఉందని పలు సర్వేలు కూడా అంచనా వేశాయి. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
TVK VIjay

TVK VIjay

తమిళనాడు రాజకీయాల్లో  తమిళగ వెట్రి కజగం (TVK) చీఫ్‌ విజయ్ ఇప్పుడు కీలకంగా మారారు. ఈ ఎన్నికల్లో ఆయన కింగ్ మేకర్‌గా మారే అవకాశం ఉందని పలు సర్వేలు కూడా అంచనా వేశాయి. ఏ పార్టీతో పొత్తు లేకుండా సొంతంగా బరిలోకి దిగిన విజయ్ పార్టీ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపిస్తుందనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. టీవీకే దాదాపు 20 స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉన్నట్లు పలు సర్వేలు తెలిపాయి. ఒకవేళ తమిళనాడులో హంగ్‌ వస్తే విజయ్ కింగ్ మేకర్ అయ్యే అవకాశాలున్నాయని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే AIADMK, బీజేపీ కలిసి టీవీకేను తమవైపు తిప్పుకునేందుకు విజయ్‌తో చర్చలు జరపుతున్నట్లు ప్రచారం నడుస్తోంది.  

గత 50 ఏళ్లుగా తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలే అధికారంలోకి వస్తున్నాయి. కొన్ని కొత్త పార్టీలు వచ్చినప్పటికీ అంతగా ప్రభావం చూపించలేకపోయాయి. అందుకే డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల్లోనే ఒకటి తప్పితే మరొకటి అధికారంలోకి వస్తున్నాయి. సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్‌.. ఈ సంప్రదాయానికి తెరదింపే అవకాశాలు కూడా ఉన్నాయని మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. యాక్సిస్ మై ఇండియా అనే సర్వే సంస్థ అయితే టీవీకే పార్టీ 98 నుంచి 120 స్థానాలు గెలుచుకుని రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఇదే జరిగితే విజయ్ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటే చేసే స్థాయికి కూడా వెళ్తుంది.  

Also Read: కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్.. నడిరోడ్డుపైనే ఎంపీ సుప్రియా సూలే!

యాక్సిస్ మై ఇండియా ప్రకారం టీవీకేకు 35 శాతం ఓట్ షేరింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. అధికార DMKకు సైతం ఇదే స్థాయిలో ఓట్ల శాతం రానుంది. ఇక విపక్ష కూటమి అయిన AIADMK, బీజేపీ కూటమికి 23 శాతం ఓట్ల షేరింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే విజయ్ పార్టీకి వచ్చే ఓట్లు సీట్లలో వస్తాయా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. టీవీకే మొదటి ఎన్నికల్లోనే బలమైన ప్రభావం చూపించే అవకాశం ఉందని దాదాపు అన్ని అన్ని ఎగ్జిట్ పోల్స్‌ చెబుతున్నాయి. 

'పోల్‌ ఆఫ్‌ పోల్స్‌'(వివిధ ఎగ్జిట్ పోల్స్‌ సగటు అంచనా)లో మాత్రం DMK, AIADMK పార్టీల మధ్య గట్టి పోటీ ఉంటుందని అంచనా వేసింది.  డీఎంకే కూటమికి 112 నుంచి 129 స్థానాలు, AIADMK కూటమికి 86 నుంచి 103 స్థానాల్లో గెలుస్తుందని తెలిపింది. మెజార్టీ సర్వేలు ఈసారి కూడా డీఎంకే అధికారంలోకి రానుందని పేర్కొన్నాయి. జేవీసీ ఎగ్జిట్ పోల్స్‌ మాత్రం AIADMK కూటమికి 127 నుంచి 148 స్థానాల్లో మెజార్టీ వస్తుందని పేర్కొంది. ఇక DMK కూటమి 100 కన్నా తక్కువ స్థానాలకే పరిమితమవుతుందని తెలిపింది. 

ఒకవేళ తమిళనాడులో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకుంటే కింగ్‌ మేకర్‌గా టీవీకే అవతరించే ఛాన్స్ ఎక్కువగా ఉందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. తమిళనాడులో ఏప్రిల్ 23న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈసారి తమిళనాడులో ఎవరు అధికారంలోకి రానున్నారనేది దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.    

Also Read: ఈవీఎంలు ముట్టుకుంటే చావు-బతుకుల పోరాటమే.. మమతా బెనర్జీ వార్నింగ్

Advertisment
తాజా కథనాలు