/rtv/media/media_files/2025/01/25/YzX4ggFTbdszCItiH9h3.jpg)
Vande Bharat Train Passes Through The World’s Highest Chenab Rail Bridge
Chenab Rail Bridge: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన జమ్మూకశ్మీర్‌లోని చీనాబ్ నదిపై నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ వంతెనపై మరో అద్భుతమైన దృశ్యం కనిపించింది. తొలిసారిగా వందేభారత్ రైలు దీనిపై పరుగులు పెట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. సెమీ హైస్పీ్డ్ వందేభారత్ రైలును శనివారం భారత రైల్వే ప్రారంభించింది. కాత్రాలోని శ్రీ మాతా వైష్ణోదేవి రైల్వే స్టేషన్ నుంచి శ్రీనగర్ వరకు ఈ రైలు పరుగులు పెట్టింది.
What a sight : VandeBharatExpress passes through the world’s highest railway bridge on the Chenab River in Jammu and Kashmir ...❤️
— Kedar (@shintre_kedar) January 25, 2025
#BiggestBankScam #MumbaiAttack #VandeBharat #MumbaiTerrorAttack pic.twitter.com/nS0THiNeEl
Also Read: కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు.. నల్లమల్లారెడ్డి 200 ఎకరాల్లో!
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన..
అయితే మార్గమధ్యంలో చీనా నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనపై ఈ వందేభారత్ రైలు ప్రయాణిస్తున్న రైలు దృశ్యాలు అబ్బురపరుస్తున్నాయి. కశ్మీర్‌లో అతిచల్లని వాతావరణాన్ని తట్టుకునేలా ఈ వందేభారత్ రైలును ప్రత్యేకంగా తయారుచేశారు. అత్యాధునిక హీటింగ్ వ్యవస్థలను ఈ రైళ్లో ఏర్పాటు చేశారు.
Also Read: పాకిస్థాన్ జైల్లో భారతీయ ఖైదీ మృతి.. శిక్షా కాలం పూర్తయినప్పటికీ.. !
ఉధంపుర్ - శ్రీనగర్ - బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా చీనాబ్ వంతెను 2022లో నిర్మించిన సంగతి తెలిసిందే. నది గర్భం నుంచి ఏకంగా 359 మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించారు. ఈ రైల్వే బ్రిడ్జి పొడవు 1,315 మీటర్లు. చైనాలో బెయిపాన్ నదిపై 275 మీటర్ల ఎత్తులో నిర్మించిన షుబాయ్ రైల్వే వంతెన ఇప్పటివరకు ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే వంతెనగా ఉండేది. అయితే చీనాబ్ నదిపై నిర్మించిన వంతెన ఈ రికార్డును బ్రేక్ చేసింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే పారిస్‌లో ఉన్న ఐఫిల్ టవర్ ఎత్తు 312 మీటర్లు. దీంతో పోలిస్తే ఈ రైల్వే వంతెన ఎత్తు 47 మీటర్లు ఎక్కువగా ఉండటం మరో విశేషం.
Also Read: Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ దాడి కేసులో మరో ట్విస్ట్.. ఎవరీ కొత్త వ్యక్తి..?
Also Read: సూపర్ సెల్ తుఫాన్‌తో బ్రెజిల్ అతలాకుతలం.. వీడియో వైరల్!