/rtv/media/media_files/2026/04/04/uttarpradesh-police-2026-04-04-16-23-21.jpg)
Uttarpradesh Police arrests four members of ‘terror module’ with links to Pakistan handlers
గతేడాది ఏప్రిల్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ విషాద ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత భారత్.. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్, పీవోకేలోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఉగ్రవాదులు మళ్లీ దేశంలోని పలు కీలక ప్రాంతాల్లో దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ దాడికి ప్లాన్ చేస్తున్న ఉగ్రముఠాను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు.
నిందితులను ప్రాథమిక విచారణ చేయగా వీళ్లకు పాకిస్థాన్ నిఘా సంస్థ అయిన ఐఎస్‌ఐ (ISI)తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు బయటపడింది. ముఖ్యంగా లక్నో, గాజియాబాద్ లాంటి నగరాల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించి, పెద్ద ఎత్తున ప్రాణనష్టం కలిగించేలా దాడులు చేయాలని వీళ్లు ప్లాన్ వేసినట్లు తేలింది. ఈ ఉగ్రదాడులు చేసేందుకు వీళ్లకు విదేశాల నుంచి నిధులు అందుతున్నాయని పోలీసులు గుర్తించారు.
Also Read : బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఒకే కుటుంబంలో తొమ్మిది మంది మృతి!
సిగ్నల్ వ్యవస్థే టార్గెట్‌గా దాడులు
లక్నో రైల్వే స్టేషన్ వద్ద కీలక రైల్వే సిగ్నల్ బాక్స్‌ను నిందితులు ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. వీళ్లలో మేరఠ్‌కు చెందిన ప్రధాన నిందితుడు సాకిబ్‌తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. రైల్వే వ్యవస్థకు అంతరాయం కలిగించి రైళ్ల ప్రమాదాలు జరిగేలా చేయాలనేది వీళ్ల ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. రైల్వే సిగ్నల్ సిస్టమ్ అనేది రైళ్ల రాకపోకలను నియంత్రించే అత్యంత కీలక విభాగం. అందుకే దాన్ని దెబ్బతీస్తే పెద్దఎత్తున ప్రమాదం జరుగుతుందని ఉగ్రవాదులు భావిస్తున్నారు.
నిఘా, సమాచార సేకరణ
ప్రధాన నిందితుడైన సాకిబ్ ఉగ్ర దాడులు చేయడం కోసం టార్గెట్ చేసుకున్న ప్రాంతాలకు వెళ్లి, అక్కడి ఫొటోలు, వీడియోలను తీసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ ఫుటేజ్ ద్వారా అక్కడున్న భద్రత, భౌగోళిక పరిస్థితులను అంచనా వేసి.. దీనికి సంబంధించిన సమాచారాన్ని పాకిస్థాన్‌లోని తమ హ్యాండ్లర్‌లకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుల వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుని.. ఈ నెట్‌వర్క్‌లో ఇంకా ఎంతమంది ఉన్నారనేదానిపై దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : కేరళలో అధికార మార్పు.. ఆ పార్టీకే అధికారం.. లోక్‌పోల్ సర్వే సంచలన రిపోర్టు
Follow Us