/rtv/media/media_files/2026/04/14/uttar-pradesh-2026-04-14-12-16-37.jpg)
Uttar pradesh govt approves wage hikes of up to Rs 3,000 for workers day after Noida violence
UP Minimum Wage Hike: ఉత్తరప్రదేశ్(Uttarpradesh) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని కార్మికుల కనీస వేతనాలను(Salary) నెలకు సుమారు రూ.3,000 వరకు పెంచింది. ముఖ్యంగా నోయిడా, గజియాబాద్ లాంటి పారిశ్రామిక ప్రాంతాల్లోని నైపుణ్యం లేని కార్మికుల వేతనాలను రూ.11,313 నుంచి రూ.13,690కి పెంచుతున్నట్లు ప్రకటన చేసింది. పెంచిన ఈ వేతనాలు ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొంది.
గత రెండ్రోజులుగా తమకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ నోయిడా, గజియాబాద్‌లో కార్మికులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం కూడా జరిగిన ఆందోళనలో పోలీసలుు, కార్మికులు మధ్య ఘర్షణలు జరిగాయి. పోలీసుల పైకి నిరసనకారులు రాళ్ల దాడికి దిగారు. రహదారులను దిగ్బంధించారు. చివిరికి భద్రతా దలాలు లాఠీచార్జ్ చేసి నిరసనాకారులను చెదగొట్టారు. పరిస్థితి హింసాత్మకంగా మారడంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది. నోయిడా, గజియాబాద్‌లో నైపుణ్యం లేని కార్మికులకు రూ.3 వేలు వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటన చేసింది.
Also Read: అంబేద్కర్‌కు నివాళులర్పించిన ప్రధాని మోదీ.. మల్లికార్జున్ ఖర్గేతో ముచ్చట్లు.. VIDEO
ఇతర రంగాల కార్మికులకు కూడా వేతనాలు పెంచుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కానీ మున్సిపల్ కార్పొరేషన్లు, జిల్లాల వారీగా ఈ వేతన పెంపు వేర్వేరుగా ఉంటుందని తెలిపింది. అయితే ఇది తాత్కాలిక నిర్ణయమేనని.. వేతన మండలి సమగ్ర సమీక్ష నిర్వహిస్తుందని తెలిపింది. ఆ తర్వాత దీనిపై పూర్తి నిర్ణయం తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది.
ఇదిలాఉండగా ఈ ఆందోళనల్లో పోలీసులు ఇప్పటిదాకా 300 మందిని అరెస్టు చేశారు. మరో 100 మందిని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ అల్లర్ల వెనుక ఏదైన కుట్ర ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఇటీవల నోయిదా పరిసరాల్లో పాక్ ఉగ్రవాదులతో సంబంధాలున్న వ్యక్తులు పట్టుబడ్డ సంగతి తెలిసిందే. దీంతో ఈ అల్లర్లతో కూడా వాళ్ల ప్రమేయం ఏమైన ఉందా అనేదానిపై దర్యాప్తు జరుగుతున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి అనిల్ రాజ్‌భర్ తెలిపారు.
Also Read: నితీశ్ కుమార్ రాజీనామా !.. బిహార్ కొత్త సీఎం ఎవరంటే ?
Follow Us