/rtv/media/media_files/2025/01/14/qXFkJLJonNp8W8l3BqsL.jpg)
UttarPradesh 9th class student committed suicide after searching for death on Google
Google: మనకు కావాల్సిన సమాచారమంతా ఇప్పుడు గూగుల్‌లో లభ్యమవుతోంది. అయితే దీనిని మనం మంచికి వాడుకుంటే మంచి లేదంటే జీవితం సర్వనాశనమేని అందరికీ తెలుసు. అయినప్పటికీ కొందరు మాత్రం తమ వెర్రికి మించిన ఆనందం లేనట్లుగా వ్యవహరిస్తుంటారు. జీవితంలో ఎదిగేందుకు గూగుల్ ను వాడుకోవాల్సిన ఓ విద్యార్థి ఏకంగా చావును వెతుక్కోవడం సంచలనం రేపింది. మీరట్ కు చెందిన బాలుడు మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఏకంగా చనిపోవడం హాట్ టాపిక్ గా మారింది.
ఆత్మ ఎక్కడికి వెళుతుందో తెలుసుకోవాలని..
ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా భావన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తొమ్మిదో తరగతి విద్యార్థి తన కుటుంబం ఎదుట కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరణానంతరం ఆత్మ ఎక్కడికి వెళుతుందో తెలుసుకోవాలనే ఉత్సుకతతో విద్యార్థిని ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసిన మెటీరియల్‌ని వెల్లడించినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. ఆ బాలుడి గూగుల్ సెర్చ్ హిస్టరీ చూసి అంతా షాక్ అయ్యారు. ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఏం జరుగుతుందో యూట్యూబ్, గూగుల్‌లో సెర్చ్ చేశాడు. ఆత్మ ఎక్కడికి వెళుతుంది? ఆత్మహత్యకు శిక్ష ఏమిటి? ఇది కాకుండా గరుడ పురాణానికి సంబంధించిన విషయాలను కూడా పరిశీలించినట్లు సెర్చ్ లో బయటపడిందని పోలీసులు వెల్లడించారు.
కుటుంబ సభ్యుల ముందే కాల్చుకుని..
శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనపై భవన్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి ధర్మేంద్ర కుమార్ మాట్లాడుతూ.. అపెక్స్ కాలనీలో నివసిస్తున్న విద్యార్థి (15) తన కుటుంబ సభ్యుల ముందే కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడంతో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాం. మరణం తర్వాత ఏమి జరుగుతుంది? మరణించే పద్ధతులు? మరణం తర్వాత మానవ ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం గురించి వెతికినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డి నన్నేం చేయలేడు.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన ఇంటర్వ్యూ!
ఇక విద్యార్థి గదిలో నుంచి ఘటనకు ఉపయోగించిన పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అతని చేతికి పిస్టల్ ఎలా వచ్చిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. తన తల్లి, అన్నయ్య తిట్టారనే కోపంతోనే విద్యార్థి ఈ చర్య తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలిందని ఆయన తెలిపారు. కుటుంబ సభ్యులు విద్యార్థిని మందలించారని విచారణలో పోలీసులు గుర్తించారు. అంతేకాదు చనిపోయేముందు తనకు ఎంతో ఇష్టమైన తన బుల్లెట్ బైక్‌ను కూడా అమ్మేశాడని గుర్తించారు. విద్యార్థి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Sharad Pawar: ఇండియా కూటమిపై శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు