USA: ఐదేళ్ళ తర్వాత కలుస్తున్న ట్రంప్, ప్రధాని మోదీ...కీలక అంశాలపై చర్చ!

రేపు వాషింగ్టన్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో భారత ప్రధాని మోదీ సమావేశం అవుతున్నారు. నేతలిరువురూ ఈ మీటింగ్ లో కీలక అంశాలను చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు.హెచ్ 1 బీ వీసాలు, గ్రీన్ కార్డులకు సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం

New Update
usa

PM Modi, USA President Trump

దాదాపు ఐదేళ్ల తర్వాత ప్రధానిమోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రేపు కలవనున్నారు. ఫ్రాన్స్ నుంచి నేరుగా అమెరికా వెళ్ళిన మోదీ రేపు ట్రంప్ తో సమావేశమవుతారు. ఈ మీటింగ్ లో నేతలిద్దరూ కలిసి భారతదేశం-అమెరికా సంబంధాలకు కొత్త దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది. వచ్చే నాలుగేళ్ళల్లో ట్రంప్ భారత్ పట్ల అనురించే విధానాలు...అలాగే ఇండియా, అమెరికా విషయంలో ఎలా ఉండాలి లాంటి అంశాలు చర్చకు రానున్నాయి. 

కీలక విషయాలపై చర్చ

అమెరికా, భారత్ ఇప్పటివరకు రెండు దేశాల్లో ఎంత మంది నాయకులు వచ్చినా ద్వైపాక్షిక సంబంధాల్లో ఎటువంటి ఇబ్బందులూ రాలేదు. ఇప్పటివరకూ చాలా మంది సత్సంబంధాలనే కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు దాన్ని మరింత బలోపేతం చేసే దిశగా మోదీ, ట్రంప్ సమావేశం ఉంటుందని చెబుతున్నారు. అమెరికా భారతదేశానికి ప్రధాన రక్షణ భాగస్వామి హోదాను ఇచ్చింది. ఇది అధునాతన సైనిక సాంకేతికతలు, ఆయుధ వ్యవస్థలను కొనుగోలు చేయడంలో కూడా ప్రాధాన్యతనిస్తుంది. రీసెంట్ గా ఇండియాలో జరిగిన వైమానిక ప్రదర్శనలో అమెరికా ఎఫ్-35 యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళే విధంగా ప్లాన్ చేయనున్నారు నేతలు. 

ఇది కూడా చదవండి: Bird flu: పెరిగిన బర్డ్ ఫ్లూ.. ఒక్కరోజే 40 లక్షల కోళ్లు ఖతం.. చికెన్ సెంటర్లకు రూ. 25వేల జరిమానా!

అలాగే తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలపైనా ప్రధాని మోదీ చర్చించనున్నారని తెలుస్తోంది. అక్రమవలదారులను వెనక్కు పంపించడం దగ్గర నుంచీ ఆర్థిక సహకారం, H-1B వీసా, గ్రీన్ కార్డ్‌కు సంబంధించిన అంశాలను మోడీ ప్రస్తావించే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ , డిజిటల్ ఎకానమీలో రెండు దేశాల మధ్యానా సహాయ సహకారాలను మరింత పెంపొందించుకునే దిశగా, రెండు దేశాలు కలిసి పని చేసే విధంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.   దీనితో పాటు, అమెరికన్ కంపెనీలు మేక్ ఇన్ ఇండియా లో భాగంగా భారతదేశంలో పెట్టుబడులను పెంచమని మోదీ అడిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 

Also Read: Cricket: మూడో మ్యాచ్ లోనూ విజయం..ఇంగ్లాండ్ తో వన్డే సీరీస్ క్లీన్ స్వీప్

 

 

 

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు