/rtv/media/media_files/cWoeqWocMewRQ4MrYxLC.jpg)
గత కొన్ని సంవత్సరాలుగా భారత్ లో యూపీఐ పేమెంట్స్ ఏ నెల కా నెల రికార్డులను నెలకొల్పుతున్నాయి. వీధి వ్యాపారుల నుంచి పెద్ద పెద్ద బిజినెస్ లకు యూపీఐ పేమెంట్స్ అంగీకరిస్తున్నారు. ఈ యూపీఐ రోజురోజుకు విస్తరిస్తుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితిలో ఫిబ్రవరి 1, 2025 నుండి యూపీఐ పేమెంట్స్ చేయలేరని ఓ వార్త వినపడుతుంది.
ఏదైనా యూపీఐ యాప్ లావాదేవీ ఐడీలో స్పెషల్ క్యారెక్టర్లు అంటే @, #, $ వంటివి ఉపయోగిస్తే ఆ లావాదేవీ రద్దు చేయడం జరుగుతుంది.భారతదేశంలో లావాదేవీ ఐడీలో స్పెషల్ క్యారెక్టర్లను ఉపయోగించే అనేక యాప్‌లు ఉన్నాయి. అయితే, Paytm, Phonepe వంటి సాధారణంగా ఉపయోగించే యాప్‌లు లావాదేవీ ఐడీలలో స్పెషల్ క్యారెక్టర్లను ఉపయోగించడం లేదు.
Also Read: DeepSeek: ప్లే స్టోర్ లో డీప్ సీక్ దూకుడు..కానీ ఆ ప్రశ్నలకు మాత్రం!
అక్షరాలను మాత్రమే...
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అన్ని యూపీఐ యాప్‌లను లావాదేవీ ఐడీలో ఆల్ఫాన్యూమరిక్ అక్షరాలను మాత్రమే ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేసింది. యాప్‌లు ఈ నియమాన్ని పాటించకపోతే ఫిబ్రవరి 1, 2025 తర్వాత వాటి లావాదేవీలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. NPCI 9 జనవరి 2025న ఒక సర్క్యులర్ విడుదల చేసింది. ఫిబ్రవరి 1, 2025 నుండి అన్ని UPI యాప్‌లు ట్రాన్సాక్షన్ ఐడీలో స్పెషల్ క్యారెక్టర్ల @, #, $ వంటివి ఉపయోగించాల్సిన అవసరం లేదని పేర్కొంది.
ఏదైనా యూపీఐ యాప్ ఈ నియమాన్ని పాటించకపోతే ఆ యాప్ నుండి యూపీఐ లావాదేవీలు పనిచేయవు. ఈ నియమం వ్యాపార వినియోగదారులకు వర్తిస్తుంది. కానీ ఇది సాధారణ వినియోగదారులను కూడా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే మీరు ఈ నియమాన్ని పాటించని ఏదైనా యాప్‌తో UPIని ఉపయోగిస్తే, మీ పేమెంట్స్ రద్దు చేయడం జరుగుతుంది. ట్రాన్సాక్షన్ ఐడీని 35 అంకెల ఆల్ఫాన్యూమరిక్‌గా మార్చగలిగేలా ఈ మార్పు చేయడానికి NPCI ఇప్పటికే అన్ని యూపీఐ యాప్‌లకు సమయం ఇచ్చింది.
దీంతో పాటు ఫేక్ ట్రాన్సాక్షన్ ఐడీలను నివారించాలని యాప్‌లకు కూడా సూచించింది. ఈ మార్పు వ్యవస్థను మెరుగుపరుస్తుందని నిపుణులు అంటున్నారు. లావాదేవీలను ట్రాక్ చేయడం సులభం అవుతుంది.. అంతేకాకుండా కస్టమర్ల భద్రత కూడా పెరుగుతుంది.
Also Read: Horoscope Today: నేడు ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం ఉంది..మీదేనేమో చూసుకోండి మరి!