/rtv/media/media_files/2025/03/25/SdRGPpfDAENY3hzt78nA.jpg)
బ్యాంకులో తీసుకున్న రుణాలను ఎగ్గొట్టేందుకు ఓ నలుగురు మహిళలు ఏకంగా కట్టుకున్న భర్తలు చనిపోయినట్లుగా మరణ ధృవీకరణ పత్రాలను బ్యాంకుకు సమర్పించారు.ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్‌లో చోటుచేసుకుంది. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసును బయటపెట్టారు. సదరు మహిళలపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 406, 419, 467, 368, 471 కింద కేసు నమోదు చేసి జైలుకు పంపించారు.
Also Read : ఫేస్ మసాజ్ చేయించుకోవడం వల్ల ప్రయోజనాలేంటి?
గ్రూప్-లెండింగ్ స్కీమ్ కింద
ఇండస్ఇండ్ బ్యాంక్ అనుబంధ సంస్థ అయిన భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లిమిటెడ్ అందించిన గ్రూప్-లెండింగ్ స్కీమ్ కింద ఈ మహిళలు గతంలో రుణాలు తీసుకున్నారు. ఈ రుణ పథకం గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లోని మహిళలకు స్వయం ఉపాధి కోసం ఆర్థిక సహాయం అందిస్తుంది. ఒకవేళ లబ్ధిదారురాలి భర్త మరణిస్తే, మిగిలిన రుణ వాయిదాలను మాఫీ చేస్తుంది. అయితే దీని అలుసుగా తీసుకున్న ఓ నలుగురు మహిళలు బ్యా్ంకుకే టోపీ పెట్టాలని అనుకున్నారు. ప్లాన్ లో భాగంగా.. ఈ నలుగురు మహిళలు తమ భర్తలు చనిపోయినట్లుగా ఫేక్ డెత్ సర్టిఫికెట్లు సృష్టి్ంచి రుణాలను ఎగ్గొట్టాలని అనుకున్నారు.
Also Read : నిరుద్యోగులకు మంత్రి లోకేష్ శుభవార్త.. 50 వేల మందికి ఫ్రీ ట్రైనింగ్!
అయితే బ్యాంకు అధికారుల దర్యాప్తులో ఆ మహిళల భర్తలు బతికి ఉన్నట్లుగా తేలింది. దీంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ దేవేష్ కుమార్ శర్మ వెల్లడించారు.
Also read : Sonu Sood wife : సోనూసూద్ భార్య సోనాలీకి యాక్సిడెంట్... తీవ్రగాయాలు!
Also Read: హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్ కేసు.. మద్యం మత్తులో యువతిని ఢీ కొట్టి..!
police | women | uttar-pradesh | latest-telugu-news | today-news-in-telugu | telugu crime news | bank-loans