/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/amith-shah-jpg.webp)
కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజ్య సభలో మాట్లాడారు. ఒకే రాజ్యాంగం ఒకే జెండా అనే రాజ్యాంగ నిర్మాతల కలను మోదీ ప్రభుత్వం నెరవేర్చిందని ఆయన అన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాద దాడులు తగ్గిపోయాయని.. అక్కడ ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొంటున్నట్లు హోంమంత్రి చెప్పారు. యూపీఏ హయాంలో ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కాశ్మీర్‌ను నాశనం చేశారని ఆయన ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానం అనుసరిస్తున్నట్లు చెప్పారు.
Also read: YS Viveka murder case: తెలంగాణ హైకోర్టు CBIకి నోటీసులు..!
తమ ప్రభుత్వం దేశంలో శాంతి భద్రతలు కాపాడటంపైనే దృష్టి పెట్టిందని అమిష్ షా తెలిపారు. జమ్ము కశ్మీర్‌లో ఉగ్రఘటనలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. 2004 నుంచి 2014 వరకు జమ్మూకాశ్మీర్‌లో 7,217 ఉగ్రవాద సంఘటనలు జరిగితే.. 2014 నుంచి 2024 మధ్య ఆ సంఖ్య 2,242కి తగ్గింది. మోదీ పాలనలో కశ్మీర్‌లో ఉగ్రవాదం వల్ల మరణాలు 70 శాతం తగ్గాయి. ఉగ్రవాదాన్ని జీరో టాలరెన్స్ విధానంతో కఠినంగా అణచివేశామని హోం మంత్రి రాజ్యసభలో చెప్పుకొచ్చారు. 2026 మార్చికల్లా నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని హామి ఇచ్చారు. ప్రస్తుతం కాశ్మీర్ యువకులు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. 2019 నుంచి 2024 వరకూ అక్కడి యువతకు 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని వివరించారు. ఒకప్పుడు ఉగ్రదాడులు, హింసతో ఉన్న ఆ ప్రాంతం ఇప్పుడు ప్రశాంతంగా ఉందని అమిత్ షా చెప్పారు.
Also read: Banks closed: దేశవ్యాప్తంగా 4 రోజులు బ్యాంకులు బంద్!