ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో మత్స్య సంపద గురించి మాట్లాడారు. అండమాన్ నికోబార్, లక్షద్వీప్‌లో మత్స్య సంపదను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలిపారు. ప్రపంచంలో చేపల ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో ఉందని తెలిపారు. అలాగే చేపల ఎగుమతుల విలువ రూ.60 వేల కోట్లకు చేరుకుందని తెలిపారు. చేపల ఉత్పత్తిని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
Also Read: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి వరాలు.. పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్‌తో పాటు కేటాయింపులివే!
అలాగే ఈసారి బడ్జెట్‌లో పేదలు, యువత, రైతులు, మహిళలపై దృష్టిసారించినట్లు నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఇందులో మత్స్య సంపద కూడా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచే పథకం, పత్తి ఉత్పత్తిని బలోపేతం చేయం, కిసాన్ క్రిడెట్ కార్డు పరిమితిని పెంచడం లాంటి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
మరోవైపు నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో రూ. 12 లక్షల వరకు ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకుండా రిబేట్ ప్రకటించారు. దీనితో పాటుగా ఆ విధానంలో శ్లాబ్‌లను కూడా మార్చారు. రూ.75000 స్టాండర్డ్ డిడక్షన్ కలిపితే రూ. రూ.12,75,000 వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. పన్ను విధానంలో కేంద్రం తీసుకొచ్చిన మార్పులపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
Also Read: కొత్త పన్నుతో ఎవరెవరికి ఎంత డబ్బు ఆదా అవుతుందో తెలుసుకోండి!
ఈ బడ్జెట్‌లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని ప్రధానంత్రి మోదీ అన్నారు. ఇది ప్రజల బడ్జెట్ అని.. నూటికి నూరు శాతం ఇది దేశాభివృద్ధికి దోహదపడుతుందని ఆయన స్పష్టం చేశారు. దేశంలో పెట్టుబడులకు బూస్టింగ్ ఇస్తోందని తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్‌ను మరింత బలోపేతం చేస్తోందన్నారు. తయారీ రంగానికి 2025 బడ్జెట్‌లో ఎంతో ప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డుల లిమిట్ రూ.5 లక్షల వరకు పెంచామని చెప్పుకొచ్చారు. ట్యాక్స్ పేయర్లకు రిలీఫ్ ఇస్తూ 12 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉండే వారికి ఇన్‌కమ్ ట్యాక్స్ ఉండదని చెప్పారు.