BREAKING: టెన్షన్ వద్దు.. గ్యాస్ వస్తోంది.. హర్మూజ్ దాటిన రెండు నౌకలు.. లేటెస్ట్ అప్డేట్స్ ఇవే!

భారత్‌కు ఊరటనిచ్చే ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. హర్మూజ్ జలసంధి గుండా వస్తూ యుద్ధం వల్ల చిక్కుకుపోయిన రెండు భారీ భారతీయ గ్యాస్ నౌకలు 'జగ్‌ వసంత్', 'పైన్ గ్యాస్' సురక్షితంగా బయటికొచ్చాయి.

New Update
Two Indian LPG carriers safely transit Strait of Hormuz

Two Indian LPG carriers safely transit Strait of Hormuz

పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో భారత్‌తో పాటు పలు దేశాల్లో చమురు, గ్యాస్ కొరతలు నెలకొన్నాయి.  అయితే తాజాగా భారత్‌కు ఊరటనిచ్చే ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. హర్మూజ్ జలసంధి గుండా వస్తూ యుద్ధం వల్ల చిక్కుకుపోయిన రెండు భారీ భారతీయ గ్యాస్ నౌకలు'జగ్‌ వసంత్', 'పైన్ గ్యాస్' సురక్షితంగా బయటికొచ్చాయి. దాదాపు 92,612 మెట్రిక్ టన్నుల వంటగ్యాస్‌తో (LPG) ఈ నౌకలు వస్తున్నాయి. సోమవారం ఉదయం పర్షియన్ గల్ఫ్ నుంచి తమ ప్రయాణాన్ని ప్రారంభించగా హర్మూజ్ జలసంధిని విజయవంతంగా దాటాయి. ఈ నౌకల్లో మొత్తం 60 మంది భారతీయ నావి సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. 

Also Read: అస్సాం ఎన్నికలు.. హ్యాట్రిక్ దిశగా దూసుకెళ్తున్న బీజేపీ.. పీపుల్స్ పల్స్ సర్వే విడుదల

యుద్దం వల్ల హర్మూజ్ జలసంధి వద్ద దాదాపు 22 భారతీయ నౌకలు అక్కడే ఆగిపోయాయి. దీంతో కేంద్రం ప్రత్యేక చొరవతో ఈ నౌకలను మన దేశానికి రప్పిస్తోంది. ఇప్పటికే 'MT శివాలిక్', 'MT నందాదేవి' నౌకలు సురక్షితంగా భారత్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు 'జగ్‌ వసంత్', 'పైన్ గ్యాస్'.. నౌకలు కూడా భారత్‌కు రానున్నాయి. మార్చి 26 నుంచి 28 మధ్య ఇవి భారత తీరానికి చేరుకునే ఛాన్స్ ఉందని పోర్టులు, షిప్పింగ్‌ మంత్రిత్వ శాఖ స్పెషల్ సెక్రటరీ రాజేష్ కుమార్ సిన్హా తెలిపారు. ఈ రెండు నౌకల్లో ఉన్నటువంటి గ్యాస్ భారత ప్రజలు ఒక రోజు వినియోగించే వంటగ్యాస్‌తో సమానమని అధికారులు చెప్పారు.

మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతన్న నేపథ్యంలో దేశంలో ఇంధన కొరత రాకుండా కేంద్రం జాగ్రత్తలు తీసుకుంటోంది. హర్మూజ్ జలసంధి గుండా చమురు, గ్యాస్ రవాణా స్తంభించినా.. భారత్‌కు వీటిని నిరంతరాయంగా సరఫరా చేసే చర్యలు తీసుకుంటున్నామని ప్రధాని మోదీ రాజ్యసభ వేదికగా వెల్లడించారు.  గత 11 ఏళ్లలో దేశీయంగా రిఫైనింగ్ సామర్థ్యాన్ని పెంచడమే కాకా, చమురు నిల్వలను కూడా పెంచినట్లు పేర్కొన్నారు. 

Also Read: రైలు ప్రయాణికులకు బిగ్ షాక్:ఆలస్యమైతే ఒక్క రూపాయి రాదు.. రూల్స్ మారాయి!

 మన దేశంలో ప్రస్తుతం 53 లక్షల మెట్రిక్ టన్నుల చమురు నిల్వలు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. దీన్ని 65 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచేలా  పనులు జరుగుతున్నట్లు తెలిపారు. అయితే హర్మూజ్ జలసంధి గుండా శత్రు దేశాల నౌకలు వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వమని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం.. దౌత్యపరమైన వ్యూహాలతో భారత నౌకలను సురక్షితంగా తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అలాగే మిగిలిన భారతీయ నౌకలను, అందులో ఉన్న సిబ్బందిని క్షేమంగా రప్పించడమే తమ టార్గెట్‌ అని కేంద్రం స్పష్టం చేసింది. 

Advertisment
తాజా కథనాలు