/rtv/media/media_files/2026/05/04/tvk-vijay-has-three-options-to-form-govt-in-tamilnadu-2026-05-04-14-41-59.jpg)
TVK Vijay has Three Options to form govt in Tamilnadu
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి. దాదాపు ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా డీఎంకే అధికారంలోకి వస్తుందని అంచనా వేయగా ఇవన్నీ తలకిందులయ్యాయి. టీవీకే పార్టీ 110 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. AIADMK 64 స్థానాల్లో మెజార్టీలో ఉండగా.. DMK 60 స్థానాల్లో లీడింగ్‌లో ఉంటూ మూడో స్థానానికి పడిపోయింది. మొత్తానికి టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. కాకపోతే 234 స్థానాలున్న తమిళనాడు(tamilnadu) లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 స్థానాల్లో గెలవాలి.
Also Read: తమిళనాడు ఎన్నికలు... ట్రెండింగ్‌లో జననాయగన్ డైలాగులు..త్రిష బర్త్‌డే
TVK Vijay Has Three Options To Form Govt
విజయ్(tvk vijay) కు దాదాపు 110 సీట్లలో గెలిచే అవకాశాలు ఉండటం వల్ల అక్కడ హంగ్ రానుంది. దీంతో టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటు కోసం మిగతా పార్టీ నేతల సపోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే విజయ్‌కు ఇప్పుడు మూడు ఆప్షన్లు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆప్షన్ 1:
DMK, AIADMKతో కాకుండా మిగిలిన పార్టీలను కలుపుకోవాల్సి ఉంటుంది. అంటే కాంగ్రెస్, PMK, CPI, VCK లాంటి సింగిల్ డిజిట్ స్థానాల్లో గెలిచిన పార్టీలతో కలసి టీవీకే ప్రభుత్వం అధికారం చేపట్టే ఛాన్స్ ఉంది.
ఆప్షన్ 2:
విజయ్‌కు ఉన్న రెండో ఆప్షన్ AIADMKతో కలవడం. టీవీకే, AIADMK కూటమితో పొత్తు పెట్టుకుంటే మ్యాజిగ్ ఫిగర్‌ను ఈజీగా దాటేస్తాయి. కానీ AIADMKతో పొత్తు పెట్టుకుంటే బీజేపీతో కలిసినట్లే అనే వాదన ఉంది. విజయ్ ఎన్నికలకు ముందే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు. మరీ ఆయన AIADMKతో కలిసి వెళ్లడం సున్నితమైన అంశమని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.
ఆప్షన్-3:
విజయ్‌కు ఉన్న మరో ఆప్షన్ డీఎంకేతో కలవడం. తమిళనాడులో ప్రధాన పార్టీ అయిన డీఎంకేతో కలిసి టీవీకే పొత్తు పెట్టుకోవడం అసాధ్యమనే విశ్లేషణలు వస్తున్నాయి. కానీ ఫలితాల ప్రభావంతో ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకునే అవకాశాలను కొట్టి పారేయలేమని మరికొందరు చెబుతున్నారు. ఒకవేళ టీవీకే, డీఎంకే కలిస్తే రాష్ట్ర స్థాయిలో బలమైన కూటమిగా ఏర్పడి.. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా నిలిచే అవకాశం ఉంటుంది.
Also Read : విజయ్ గెలుపు వెనుక జగన్.. ఫొటోలు వైరల్!
Follow Us