Trisha: త్రిషకు సారీ చెప్పిన బీజేపీ నేత

ఇటీవల విజయ్, త్రిష విషయంలో బీజేపీ నేత నాగేంద్రన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై త్రిష కూడా స్పందించింది. చివరికి బీజేపీ నేత తాను చేసిన వ్యాఖ్యలను తాజాగా ఉపసంహరించుకున్నారు. త్రిషకు క్షమాపణలు చెప్పారు. 

New Update
Trisha breaks silence after BJP Tamil Nadu chief links her to Vijay

Trisha breaks silence after BJP Tamil Nadu chief links her to Vijay

Trisha: ఇటీవల విజయ్, త్రిష విషయంలో తమిళనాడు బీజేపీ చీఫ్ నాగేంద్రన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. విజయ్ రాజకీయాల్లో ఎదగాలనుకుంటే త్రిషతో ఉన్న బంధం నుంచి బయటికి రావాలని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి. దీనిపై త్రిష కూడా స్పందించింది. చివరికి బీజేపీ నేత తాను చేసిన వ్యాఖ్యలను తాజాగా ఉపసంహరించుకున్నారు. త్రిషకు క్షమాపణలు చెప్పారు. 

ఇక వివరాల్లోకి వెళ్తే ఇటీవల బీజేపీ నేత నైనర్ నాగేంద్రన్ టీవీకే అధినేత విజయ్‌ను విమర్శిస్తూ మాట్లాడారు. విజయ్‌కు రాజకీయాలు తెలియవని అన్నారు. ఆయన రాజకీయాల్లో ఎదగాలనుకుంటే ముందు త్రిషతో ఉన్న బంధం నుంచి బయటకు రావాలని విమర్శించారు. అప్పుడే ఆయనకు తమిళనాడులోని గ్రౌండ్ రియాల్టీ తెలుస్తుందని సెటైర్లు వేశారు. అయితే నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై టీవీకే నేతలు, డీఎంకే నేతలు కూడా తీవ్రంగా ఖండించారు. 

Also Read: ఎంపీ రేణుకా చౌదరికి  బిగ్ షాక్.. నోటీసులు జారీ!

త్రిష కూడా దీనిపై ఎక్స్‌లో స్పందించింది. తన లాయర్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను పోస్టు చేసింది. దీనికి '' అగౌరవాన్ని కచ్చితంగా ఎప్పుడైనా నిలదీయాల్సిందే'' అంటూ రాసుకొచ్చింది. ఆ స్టేట్‌మెంట్‌లో ఆమె లాయర్ ఇలా రాసుకొచ్చారు. '' రాష్ట్ర రాజకీయాల్లో కీలక స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తారని నా క్లయింట్‌ (త్రిష) ఊహించలేదు. ఆమెకు ఎలాంటి రాజకీయ పార్టీతో సంబంధాలు లేవు. భవిష్యత్తులో కూడా అలాంటి ఆలోచన లేదు. రాజకీయాలకు సంబంధించిన విషయాల్లో ఆమె ఎప్పుడూ కూడా తటస్థంగా ఉంటున్నారు. 

ఆమె వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి తీసుకురావొద్దు. ఉన్నత స్థాయిలో ఉన్నవారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని భావిస్తున్నాం. త్రిష పేరుని ఆమెకు సంబంధం లేని విషయాల్లోకి తీసుకురాకూడదని అభ్యర్థిస్తున్నామని'' త్రిష లాయర్ నిత్యేష్ నటరాజ్‌ స్టేట్‌మెంట్‌ విడుదల చేశారు. చివరికి బీజేపీ నేత  నాగేంద్రన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటన చేశారు. నా వ్యాఖ్యల వల్ల ఎవరైనా మనస్తాపానికి గురై ఉంటే క్షమాపణాలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.