సోమవారం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టబోయే స్పేడెక్స్ ప్రయోగం వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనిపై ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమ్‌నాథ్ స్పందించారు. ఆలస్యానికి గల కారణాలను వివరించారు. అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ జరగడం వల్లే అనుకున్న సమయానికి ప్రయోగం జరగలేదని తెలిపారు. Also Read: 'సలార్' కు ఫస్ట్ నన్నే అడిగారు.. కానీ? స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ '' స్పేస్‌లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. రాకెట్ వెళ్లాల్సిన అదే కక్ష్యలో ఇతర శాటిలైట్లు అనుసంధానం చెందడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల ప్రయోగం రెండు నిమిషాలు ఆలస్యం జరిగింది. సోమవారం రాత్రి 9.58 PM గంటలకు బదులుగా 10 గంటల 15 సెకండ్లకు రీషెడ్యూల్ చేశామని'' సోమనాథ్ తెలిపారు. అంతేకాదు ఇలా ప్రయోగాలు ఆలస్యం రావడం మొదటిసారేం కాదన్నారు. 2023లో చంద్రయాన్-3 మిషన్ కూడా కొన్ని నిమిషాల పాటు వాయిదా పడిందని చెప్పారు. అయితే స్టార్ లింక్‌కు చెందిన పలు శాటిలైట్లు ఈ దారిలో వస్తున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించారు. స్టార్‌లింక్‌కు చెందిన 7 వేల శాటిలైట్లు భూమి కక్ష్యలో దిగువ భాగంలో ఉన్నాయని చెప్పారు. అంతేకాదు చాలాకాలం నుంచి భారీ నక్షత్రరాశులు అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్‌కు కారణమవుతున్నాయని వివిధ అంతరిక్ష సంస్థల సైంటిస్టులు తెలిపారు. అలాగే అంతరిక్ష వ్యర్థాల వల్ల శాటిలైట్లకు భారీ ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. Also Read: నా అసలు పేరు అదికాదు.. ఆ ఇన్సిడెంట్ తో పేరు మార్చుకున్నా : రెజీనా కసాండ్రా ఇదిలాఉండగా సోమవారం రాత్రి సతీశ్‌ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్‌ఎల్సీసీ-60 నింగిలోకి దూసుకెళ్లనుంది. స్పేడెక్స్ ప్రయోగం ద్వారా ఛేజర్, టార్గెట్ శాటిలైట్లను కక్ష్యలో పీఎస్‌ఎల్సీవీసీ-60 ప్రవేశపెట్టనుంది. ఈ రెండు ఉపగ్రహాల బరువు మొత్తం 440 కిలోలు. అయితే ప్రయోగం చేపట్టేందుకు కౌంట్‌డౌన్ ప్రక్రియ మొదలైన తర్వాత స్పేస్‌లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ప్రయోగం రెండు నిమిషాలు వాయిదా పడింది. రాత్రి 10 గంటల 15 సెకండ్లను ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.