/rtv/media/media_files/2025/03/31/xQCAvG8kfWlafIS00UVP.jpg)
Top woman Naxal leader with Rs 25 lakh bounty killed in Dantewada encounter
ఛత్తీస్‌గఢ్ అడవుల్లో మరోసారి కాల్పులు జరిగాయి. బస్తర్ ప్రాంతంలో సోమవారం భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందింది. ఆమెను వరంగల్‌కు చెందిన రేణుకగా గుర్తించారు. అంతేకాదు మృతిరాలి తలపై రూ.25 లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక వివరాల్లోకి వెళ్తే దంతెవాడ, బీజాపుర్ జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
Also Read: నా మండే మోటివేషన్ ఆయనే: ఆనంద్ మహీంద్రా
ఈ నేపథ్యంలోనే డీఆర్‌జీ సిబ్బంది యంటీ నక్సలైట్ ఆపరేషన్‌ను ప్రారంభించారు. మావోయిస్టులు కాల్పులకు పాల్పడగా.. భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులకు దిగారు. ఎన్‌కౌంటర్ తర్వాత ఘటనాస్థలంలో ఓ మహిళా నక్సలైట్ మ-ృతదేహాన్ని గుర్తించినట్లు అధికారులు చెప్పారు. మృతురాలిని తెలంగాణలోని వరంగల్‌కు చెందిన రేణక అలియస్ సరస్వతిగా గుర్తించారు.
Also Read: ఈద్ సందడి.. ముస్లింలకు ప్రధాని మోదీ స్పెషల్ విషెస్
ఈమె మావోయిస్టు స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. అలాగే దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రెస్ టీమ్ ఇంఛార్జ్‌గా కూడా ఉన్నట్ల పేర్కొన్నారు. ఆమె తలపై రూ.25 లక్షల రివార్డు ఉందన్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాల్లో భారీ ఎత్తున తుపాకులు, ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలు భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
Also Read: మూడు రోజుల తరువాత భూకంప శిథిలాల కింద నుంచి సజీవంగా..!
telugu-news | rtv-news | chattisgarh | maoist | national-news