/rtv/media/media_files/2025/03/24/Cnu5EID1LmTzVE9UYesr.jpg)
Toll Plaza
దేశంలో జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల నుంచి కేంద్రానికి భారీగా ట్యాక్స్ వచ్చింది. గడిచిన ఐదేళ్లలో మొత్తం రూ.1.93 లక్షల కోట్లు వసూలు చేసింది. దీనికి సంబంధించిన వివరాలను లోక్‌సభలో రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రభుత్వం ఇచ్చిన డేటా ప్రకారం చూసుకుంటే.. దేశంలో అత్యధిక టోల్ ట్యాక్స్‌ను గుజరాత్‌లో NH-48లో ఉన్న వడోదరభరూచ్ సెక్షన్‌లోని టోల్ ప్లాజా వసూలు చేసింది. 2019 నుంచి 2024 వరకు రూ.2,043.81 కోట్ల టోల్‌ను వసూలు చేసింది.
టోల్ ఆదాయ జాబితాలో రెండోస్థానంలో రాజస్థాన్ నిలిచింది. గత ఏదేళ్లలో షాజహాన్‌పూర్ టోల్ ప్లాజాలో రూ.1,884.46 కోట్ల విలువైన టోల్ వసూలు అయినట్లు రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక మూడో స్థానంలో పశ్చిమ బెంగాల్‌లోని జల్ధులగోరి టోల్ ప్లాజా నిలిచింది. 2019 నుంచి 2024 వరకు ఇక్కడి నుంచి రూ.1,538.91 కోట్లు వసూలయ్యాయి. యూపీలోని బారజోధ టోల్ ప్లాజా గత ఏదేళ్లలో రూ.1,480.75 కోట్లు వసూలు చేసి నాలుగో స్థానంలో నిలిచింది.
Also Read: ముస్లిం రిజర్వేషన్లపై పార్లమెంట్‌లో గందరగోళం.. రాజ్యంగంపై నడ్డా సంచలన కామెంట్స్!
టాప్ 10 ఆదాయాన్నిచ్చే టోల్ ప్లాజాల జాబితాలో రెండు ప్లాజాలు గుజరాత్‌లోనే ఉన్నాయి. మరో రెండు రాజస్థాన్‌లో, రెండు యూపీలో ఉన్నాయి. ఇక హర్యానా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, బీహార్‌లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. గత ఏదేళ్లలో ఈ టాప్ 10 టోల్ ప్లాజాలు రూ.13,988.51 కోట్ల విలువైన టోల్‌ను వసూలు చేశాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చూసుకుంటే మొత్తం 1,603 టోల్ ప్లాజాలున్నాయి. వీటిలో 457 టోల్ ప్లాజాలు గత ఐదేళ్లలోనే ఏర్పాటు చేశారు.
టాప్ 10 ఆదాయాన్ని ఆర్జించే టోల్ ప్లాజాల జాబితాలో రెండు ప్లాజాలు గుజరాత్‌లో, రెండు రాజస్థాన్‌లో రెండు ఉత్తరప్రదేశ్‌లో ఉన్నాయి. హర్యానా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, బీహార్‌లలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. గత ఐదేళ్లలో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించే 10 టోల్ ప్లాజాలు రూ.13,988.51 కోట్ల విలువైన టోల్ వసూలు చేశాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 1,063 టోల్ ప్లాజాలు ఉన్నాయి. వీటిలో 457 టోల్ ప్లాజాలను గత ఐదేళ్లలో ఏర్పాటు చేశారు. మొత్తానికి గడిచిన ఐదేళ్లలో దేశవ్యాప్తంగా అన్ని టోల్ ప్లాజాల నుంచి రూ.1.93 లక్షల కోట్లు వసూలయ్యాయి.
Also Read: వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్న అపర కుభేరుడు.. లగ్జరీ నౌకలో పెళ్లి!
rtv-news | toll-plaza | tax