Odisha Shocking News: అక్క అస్థిపంజరంతో బ్యాంక్‌కు..... తమ్ముడుచేసిన పనికి అంతా షాక్‌

ఒడిశాలోని కియోంజర్ జిల్లాలో హృదయవిదారకమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తన సోదరి బ్యాంక్ ఖాతాలో ఉన్న 19,300 రూపాయలను డ్రా చేసేందుకు, జితు ముండా అనే వ్యక్తి ఆమె అస్థిపంజరాన్ని భుజంపై మోసుకుంటూ మూడు కిలోమీటర్ల దూరం మండే ఎండలో నడిచి బ్యాంకుకు వెళ్లాడు.

New Update
FotoJet - 2026-04-28T110942.425

To the bank with the skeleton of the older sister

Odisha Shocking News: ఒడిశాలోని కియోంజర్ జిల్లాలో హృదయవిదారకమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తన సోదరి బ్యాంక్ ఖాతాలో ఉన్న 19,300 రూపాయలను డ్రా చేసేందుకు, జితు ముండా అనే వ్యక్తి ఆమె అస్థిపంజరాన్ని భుజంపై మోసుకుంటూ మూడు కిలోమీటర్ల దూరం మండే ఎండలో నడిచి బ్యాంకుకు వెళ్లాడు. డయానాలీ గ్రామానికి చెందిన జితు సోదరి కాక్రా ముండా రెండు నెలల క్రితమే మరణించింది. ఆమె భర్త, ఏకైక సంతానం అంతకుముందే చనిపోవడంతో, జితు ఒక్కడే ఆమెకు మిగిలిన ఏకైక బంధువు.

కాక్రా ముండాకు మల్లిపాసిలోని ఒడిశా గ్రామీణ బ్యాంక్‌లో ఖాతా ఉండేది. ఆమె మరణం తర్వాత ఆ ఖాతాలో ఉన్న సొమ్మును విత్ డ్రా చేసేందుకు జితు బ్యాంకుకు వెళ్లగా, అక్కడి మేనేజర్ నిబంధనల పేరుతో నిరాకరించారు. ఖాతాదారు నేరుగా రావాలని లేదా ఆమె వారసుడనే చట్టబద్ధమైన పత్రాలను సమర్పించాలని తెగేసి చెప్పారు. నిరక్షరాస్యుడైన ఆ గిరిజన వ్యక్తి వద్ద మరణ ధృవీకరణ పత్రం గానీ, వారసత్వ పత్రాలు గానీ లేకపోవడంతో, సంక్లిష్టమైన బ్యాంకింగ్ ప్రక్రియను అర్థం చేసుకోలేక మొదటిసారి నిస్సహాయంగా వెనుదిరిగాడు.

Also Read: ’కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరీ’ రిలీజ్ డేట్ ఫిక్స్!

అయితే, ఆ డబ్బు తన అవసరాలకు అత్యంత కీలకం కావడంతో జితు సోమవారం నాడు ఒక ఘోర నిర్ణయం తీసుకున్నాడు. గ్రామ శ్మశాన వాటికకు వెళ్లి, రెండు నెలల క్రితం పూడ్చిపెట్టిన తన సోదరి అస్థిపంజరాన్ని వెలికితీశాడు. దానిని ఒక గుడ్డలో చుట్టి, భుజంపై వేసుకుని ఎండలో మూడు కిలోమీటర్లు నడిచి మళ్లీ బ్యాంకుకు చేరుకున్నాడు. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. నిబంధనల పేరుతో ఒక పేదవాడిని ఇంతలా వేధించడంపై గ్రామస్తులు బ్యాంకు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: "డార్లింగ్ 4K" రీ-రిలీజ్ విధ్వంసం! ఆ రికార్డులన్నీ లేపేసిన ప్రభాస్!

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. జితును ఓదార్చి, మానవతా దృక్పథంతో ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. స్థానిక సర్పంచ్ ద్వారా ధృవీకరణ పొంది ఉండవచ్చని లేదా క్షేత్రస్థాయి పరిశీలన చేసి ఉండవచ్చని, కానీ బ్యాంక్ అధికారులు కేవలం కాగితాలకే ప్రాధాన్యత ఇచ్చి మానవత్వాన్ని విస్మరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఉదంతంపై వివరణ ఇవ్వాలని పోలీసులు బ్యాంకు యాజమాన్యాన్ని కోరారు.

Advertisment
తాజా కథనాలు