West Bengal: అప్పుడు జగన్‌.. ఇప్పుడు మమతా.. అదే తప్పు.. అదే ఫలితం

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో మమతా బెనర్జీకి బిగ్ షాక్ తగిలింది. మూడుసార్లు వరుసగా అధికారంలోకి వచ్చిన టీఎంసీ పార్టీ ఈసారి వెనుకంజలో ఉంది. 97 స్థానాల్లో టీఎంసీ లీడింగ్‌లో ఉండగా బీజేపీ 191 స్థానాల్లో లీడింగ్‌ ఉంటూ మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది.

New Update
Jagan and Mamata Benarjee

Jagan and Mamata Benarjee

పశ్చిమ బెంగాల్‌(west bengal) ఎన్నికల్లో మమతా బెనర్జీ(mamta-benarjee) కి బిగ్ షాక్ తగిలింది. మూడుసార్లు వరుసగా అధికారంలోకి వచ్చిన టీఎంసీ పార్టీ ఈసారి వెనుకంజలో ఉంది. 97 స్థానాల్లో టీఎంసీ లీడింగ్‌లో ఉండగా బీజేపీ 191 స్థానాల్లో లీడింగ్‌ ఉంటూ మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది. మొత్తానికి పశ్చిమ బెంగాల్‌లో ఈసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోంది. 

Also Read: విజయ్ డ్రైవర్ కొడుకు సంచలనం..  భారీగా ఆధిక్యం!

TMC Chief Mamata Benarjee Strategy

 మమతా బెనర్జీ ఈ ఎన్నికల్లో ఏకంగా 74 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వలేదు.  మరో 15 మంది ఎమ్మెల్యేలను వాళ్లు గతంలో పోటీ చేసిన నియోజకవర్గాల నుంచి వేరే నియోజకవర్గాలకు మార్చేశారు. మరో135 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి అదే స్థానాల్లో బరిలోకి దింపారు. ఇలాంటి వ్యూహాలు మార్చినప్పటికీ దీదీకి ఎదురుదెబ్బ తగిలింది. టీఎంసీ పార్టీ ఓటమి దిశగా వెళ్తోంది. 

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించి పెద్దగా మార్పులు చేయలేదు.  ఏడెనిమిది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మాత్రమే మార్చారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకపోవడం వల్లే బీఆర్‌ఎస్‌ ఓడిపోయిందనే ప్రచారం నడిచింది. కేసీఆర్‌ చేసిన పొరపాటును గ్రహించిన వైసీపీ చీఫ్‌ జగన్‌ ఎన్నికల వ్యూహాలు మార్చారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన.. 175 స్థానాలకు  దాదాపు 80 మందికి పైగా అభ్యర్థులను మార్చారు. వీళ్లలో 40 నుంచి -50 మందిని ఒక నియోజకవర్గం నుంచి వేరే నియోజకవర్గానికి మార్చారు. మరో 30 నుంచి 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అసలు టికెట్లే ఇవ్వలేదు. అయినప్పటికీ ఆ ఎన్నికల్లో జగన్ ఫెయిలయ్యారు. మమతా బెనర్జీ కూడా ఇలాంటి మార్పులు చేసినప్పటికీ విఫలమయ్యారు. 

Also Read :  తమిళనాడు ఎన్నికలు.. ఏడోసారి ఓటమి అంచున తెలంగాణ మాజీ గవర్నర్‌!

Advertisment
తాజా కథనాలు