/rtv/media/media_files/2025/02/15/eAzVQQcWqsVBWdFn27cA.jpg)
New born baby
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లోని భోపాల్‌లో దారుణం జరిగింది. ఓ తల్లి తన పసిబిడ్డ గొంత కోసం చెత్త బుట్టలో పడేసింది. అయినప్పటికీ ఆ చిన్నారి బతికి బయటపడింది. ఆడపిల్ల పుట్టిందనే కారణంతోనే ఆ తల్లి ఇలాంటి దారుణానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. నెల రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లో ఓ మహిళా బిడ్డకు జన్మనిచ్చింది. కానీ మహిళా తన తల్లితో కలిసి ఆ పాప గొంతు పిసికింది. దీంతో ఆ చిన్నారి స్పృహ తప్పిపోయింది.
Also Read: రండి.. రండి.. పానీ పూరీ తింటే రూ.21 వేల ప్రైజ్‌మనీ.. ఎగబడుతున్న కస్టమర్స్!
Bhopal New Born Baby Crime
ఆ పాప చనిపోయిందనుకుని వాళ్లు ఓ చెత్తబుట్టలో పడేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికీ చిన్నారి ఏడుపులు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వాళ్లు భోపాల్‌లోని కమలా నెహ్రూ ఆస్పత్రికి తరలించారు. దాదాపు నెల రోజుల పాటు కొందరు వైద్యులు ఆ చిన్నారికి పలు శస్త్రచికిత్సలు చేసి బతికించారు. పాప గొంత పిసికినా కూడా.. కీలకమైన ధమనులు, సిరలు తెగిపోలేవు. అందువల్లే పాపను రక్షించామని, ఇన్ని శస్త్రచికిత్సలు తట్టుకొని కూడా పాప బతకడం అద్భుతమని వైద్యులు తెలిపారు. ఆ పాపను ముద్దుగా పిహు అని పిలుచుకుంటున్నట్లు చెప్పారు.
Also Read: డేంజర్ జోన్‌లో ఇండియా.. అణబాంబు కంటే 500 రెట్ల వినాశనం!
అయితే ఆ పాపను బాలల సంక్షేమ కమిటీ పర్మిషన్‌తో రాజ్‌గఢ్‌లోని ఓ సంక్షేమ కేంద్రానికి తరలించినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. చిన్నారిని అక్కడ అప్పగించిన తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేసినట్లు పోలీసులు చెప్పారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పనిపాపపై ఈ దారుణానికి పాల్పడ్డ ఆ చిన్నారి తల్లి, అమ్మమ్మను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.
Also Read: మోదీ మాటలకే పరిమితం.. AI విషయంలో ఫెయిల్: రాహుల్ గాంధీ
Also Read : వంశీని వదిలిపెట్టం.. అరెస్ట్ పై లోకేష్ ఫస్ట్ రియాక్షన్!