BIG BREAKING: భారీ పేలుడు.. ఆరుగురు మృతి

కేరళలోని త్రిస్సూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ బాణసంచా తయారీ కేంద్రంలో భారీగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

New Update
Three killed in blast at fireworks unit in Kerala's Thrissur

Three killed in blast at fireworks unit in Kerala's Thrissur

కేరళలోని త్రిస్సూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ బాణసంచా తయారీ కేంద్రంలో భారీగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీళ్లలో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: ప్రధాని మోదీ 'ఉగ్రవాది'.. మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు

ఇదిలాఉండగా ఇటీవలే తమిళనాడులోని విరుదునగర్‌ జిల్లాలో కూడా ఓ బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఆదివారం జరిగిన ఈ విషాద ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి ఆ బాణసంచా కేంద్రం ధ్వంసమైపోయింది.  అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశారు. ఆదివారం రోజుల కార్మికులు టపాసుల తయారుచేస్తుండగా.. మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ పేలుడు సంభవించింది. ముడి పదార్థాలు కలుపుతుండగా రాపిడికి గురవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై సీఎం స్టాలిన్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

Advertisment
తాజా కథనాలు