/rtv/media/media_files/2025/02/11/PnPaoTxSdkQgETlqZ4Cg.jpg)
PM Modi
PM Modi: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్(Emmanuel Macron) తో కలిసి ఏఐ సమ్మిట్(AI Summit) కు అధ్యక్షత వహించడం ఆనందంగా ఉందని అన్నారు ప్రధాని మోదీ. గత రెండేళ్ళల్లో తామిద్దరం కలవడం ఇది ఆరోసారని చెప్పారు. భారత్ లో గత పదేళ్ళల్లో చాలా మార్పులు జరిగాయి. భారత్ అన్ని రకాలుగా , స్థిరంగా అభివృద్ధి చెందుతోంది. త్వరలో ఇండియా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని మోదీ చెప్పుకొచ్చారు. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్’’ని ప్రోత్సహిస్తున్నాం’ అని మోదీ చెప్పారు. అందుకే ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం మంచిదని సూచించారు. 2047 నాటికి దేశం వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తున్న నేపథ్యంలో భారత్ లో వ్యాపారం పెరుగుదలకు ఆస్కారం ఉందని ఆయన చెప్పారు.
టెక్నాలజీ వలన పని రూపాంతరం చెందుతుంది..
ప్రస్తుతం జరుగుతున్న ఏఐ సమ్మిట్ గురించి మాట్లాడుతూ..ఏఐ టెక్నాలజీ వలన ఉద్యోగాలు పోతాయనే ఆందోళనను ఆయన కొట్టిపారేశారు. టెక్నాలజీ వలన పని మాయం అయిపోదని...రూపాంతరం చెందుతుందని ప్రధాని మోదీ చెప్పారు. రాజకీయాలను, ఆర్థిక వ్యవస్థను, భద్రతను, సమాజాన్ని ఏఐ మారుస్తోందని, ఈ శతాబ్దపు మానవతావాదానికి కోడ్ రాస్తోందన్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏఐ సమ్మిట్ ను భారత్ లో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నమాని మోదీ తెలిపారు. ఏఐ ఫౌండేషన్, కౌన్సిల్ ఫర్ సస్టెయినబుల్ ఏఐ ఏర్పాటుకు మద్దతు పలుకుతున్నామన్నారు.
Also Read: Trump: ట్రంప్ మరో తలతిక్క నిర్ణయం...ప్రపంచ దేశాలకు విరుద్ధంగా పేపర్ వద్దు..ప్లాస్టికే ముద్దంటన్న పెద్దన్న!
140 కోట్ల మంది ప్రజల కోసం భారత్ అందుబాటు ధరలోనే డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నిర్మించిందని మోదీ అన్నారు. ప్రస్తుతం ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనే వందతులు ఉన్నాయి. చరిత్రను చూసుకుంటే పని అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. కానీ అది మనం చేసే పద్ధితిలో కాలానుగుణంగా మారుతూ వస్తుంది. అలాగే కొత్త ఉద్యోగాలు సైతం సృష్టించబడతాయి. ఉద్యోగాల్లో తమ స్కిల్స్‌ను పెంచుకునేవారికే ఈ అవకాశాలు దక్కుతాయని ప్రధాని చెప్పారు. భారత్.. డిజిటల్ మార్కెట్, వాణిజ్యం దిశగా ముందుకెళ్తోంది.
Also Read: Cricket: ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బుమ్రా అవుట్...అతనికి ఛాన్స్..