/rtv/media/media_files/2026/04/12/fotojet-48-2026-04-12-19-32-51.jpg)
Lata Mangeshkar Asha Bhosle
Asha Bhosle, Lata Mangeshkar : పాటల కోకిల ఆశా భోంస్లే అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం నాడు ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో మరణించిన విషయం తెలిసిందే. దీంతో మరో పాటల కోకిల మూగబోయింది. అయితే ఇక్కడ ఒక విషయం ఇపుడు అందరూ గుర్తు చేసుకుంటున్నారు. ఆశా భోంస్లే. మరో లెజెండరి సింగర్ లతా మంగేష్కర్(indian-singers) సొంత అక్కచెల్లెళ్లు(Sisters) అయితే వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడం వల్ల ఒకరితో ఒకరు చాలాకాలం మాట్లాడుకోలేదన్న విషయం ఇపుడు చర్చనీయంశంగా మారింది. ముఖ్యంగా లతా మంగేష్కర్ చాలా రోజుల పాటు ఆశాను దూరం పెట్టారని ప్రచారం సాగింది.
లతా మంగేష్కర్(latha-mangeshkar), ఆశా భోంస్లేలు ఇద్దరూ భారతీయ సంగీతంలో ఎపుడు మరుపురాని గొప్ప గాయనీమణులే. అయితే వారి మధ్య గొడవలు ఉన్నాయా? అంటే కొంత నిజం, కొంత కల్పితం అంటారు వారి గురించి తెలిసినవారు. ఆశా భోంస్లే చిన్న వయసులోనే కుటుంబాన్ని కాదని వారి అభిప్రాయాలకు వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నారనే ప్రచారం ఉంది. దీంతో లతా మంగేష్కర్ ఆమెను దూరం పెట్టారని కథనాలు వచ్చాయి. అదే కాక ఇద్దరూ ఒకే రంగంలో (ప్లేబ్యాక్ సింగింగ్) ఉండటం వల్ల సహజంగానే పోటీతో కూడిన ఈగో ఉండిందని చెబుతారు.
Also Read : 21 గంటలు.. పాక్‌లో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టని JD వాన్స్.. ఎందుకో తెలిస్తే షాక్!
Gap Between Asha Bhosle And Lata Mangeshkar
అయితే లతా మంగేస్కర్ ఎక్కువగా సినిమాల్లో ఎక్కువగా ప్రధాన హీరోయిన్‌లకు పాటలు పాడారు. ఆశా భోస్లే మాత్రం అనేక భిన్నమైన, వెరైటీ పాటలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అవసరాన్ని బట్టి కొంతమంది సంగీత దర్శకులు ఒక్కరికే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల కూడా ఈ గ్యాఫ్ వచ్చిందనేది వాస్తవం. అయితే, కొంతకాలం పోయాక మళ్లీ ఇద్దరూ కలిశారు. కుటుంబ కార్యక్రమాలు, ఇంటర్వ్యూల్లో ఒకరిపై ఒకరు గౌరవం వ్యక్తం చేసుకునేవారు.
1984లో ‘ఉత్సవ్’ సినిమాలో ‘మన్ క్యోం బెహ్‌కా రీ బెహ్‌కా...’ పాట ఇద్దరూ కలిసి పాడారు. ఆ తరువాత కలిసి పాడలేదు. కానీ, ఆ తర్వాత పన్నేండేళ్ల క్రితం లతా మంగేష్కర్ సొంత సంగీత సంస్థ ‘ఎల్.ఎం. మ్యూజిక్’లో ఆశా భోంస్లే ఒక పాట కూడా పాడారు. ఏ హవా...’ అనే ఆ పాటను ఆశా భోంస్లే, షాన్‌లు కలిసి 2014లో గానం చేశారు. ఆ సమయంలో తన సోదరి గురించి లతా మంగేష్కర్ మాట్లాడుతూ ‘‘మళ్ళీ మా చెల్లెలితో ఇలా కలవడం ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు. ‘‘మా చెల్లెలు బహుముఖ ప్రతిభ ఉన్న గాయని. ఆమెతో కలసి చాలా పాటలు పాడాను. ఆమెతో కలసి పాడడం ఎప్పుడూ ఓ సవాలే’’ అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం. లతా మంగేష్కర్ 2022లో కోవిడ్-19, న్యుమోనియా సమస్యల కారణంగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలోనే మరణించారు.
Also Read : TVK పార్టీకి బిగ్ షాక్.. విజయ్ సంచలన నిర్ణయం.. ప్రచార ర్యాలీలు రద్దు!
Follow Us