Quantum Technology: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటమ్ టెస్ట్‌బెడ్‌లు..వీటి సామర్థ్యం, సాంకేతిక విశేషాలు ఏంటంటే?

దేశం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వైపు పరుగులు పెడుతోంది. ఈ క్రమంలో ఆ సాంకేతికతను అందుకోవడంలో ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో ఉంది. మంగళవారం (ఏప్రిల్ 14) ఏపీ సీఎం చంద్రబాబు భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ క్వాంటమ్ కంప్యూటింగ్ టెస్ట్‌బెడ్‌లను అమరావతిలో ప్రారంభించారు.

New Update
FotoJet (67)

Quantum Technology

Quantum Technology : దేశం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వైపు పరుగులు పెడుతోంది. ఈ క్రమంలో ఆ సాంకేతికతను అందుకోవడంలో ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో ఉంది. మంగళవారం (ఏప్రిల్ 14) ఏపీ  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ క్వాంటమ్ కంప్యూటింగ్ టెస్ట్‌బెడ్‌ లను అమరావతి(India’s First Quantum Hardware Test Beds in Amaravati)లో  ప్రారంభించారు. ఇంతకీ ఈ క్వాంటమ్ బెడ్స్ అంటే ఏమిటీ? వాటి గురించిన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం...

అమరావతి క్వాంటమ్ వ్యాలీలో భాగంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, మేధా టవర్స్‌లో సిద్దం చేసిన రెండు వేర్వేరు క్వాంటమ్ కంప్యూటర్ టెస్ట్ బెడ్స్ చంద్రబాబు ఆవిష్కరించారు. దీంతో క్వాంటమ్ పరిశోధనలు, పరీక్షలు, ఆవిష్కరణల కోసం ఒక దేశీయ ఏకోసిస్టమ్‌ను నిర్మించడంలో ఆంధ్రప్రదేశ్‌ ఒక మార్గదర్శిగా నిలవనుంది. అమరావతి కేంద్రంగా ఆవిష్కృతం అయిన ఈ క్వాంటమ్ రిఫరెన్స్‌ ఫెసిలిటీతో టెక్ శకంలో నూతన అధ్యాయానికి నాంది పడిందని చెప్పవచ్చు.  అయితే దేశంలోనే క్వాంటమ్ సాంకేతికతలను పరీక్షించడానికి, ధృవీకరించడానికి ఒక ప్రత్యేక మౌలిక సదుపాయాన్ని ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారని చెప్పవచ్చు. దీంతో ఇది దేశ టెక్ చరిత్రలో కీలక మైలురాయిగా నిలవనుంది.

Also Read :  పవర్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. 10 మంది మృతి

సాంకేతికత...

1 ఎస్ వ్యవస్థ క్వాంటమ్ కంప్యూటింగ్‌(Quantum Computer Test) లో ఒక ప్రముఖ విధానమైన సూపర్‌కండక్టింగ్ సాంకేతికతపై ఆధారపడి ఉంటుంది. క్వాంటమ్ పొందిక, కచ్చితత్వాన్ని కాపాడుకోవడానికి అవసరమైన అబ్సల్యూట్ జీరో, అంటే మైనస్ 273 డిగ్రీల సెల్సియస్ దగ్గరగా, అత్యంత తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఈ రెండు టెస్ట్‌బెడ్‌లు పనిచేయనున్నాయి. దాని కోసం కూలింగ్‌ కంప్రెషర్లు ఉంటాయి. ఈ కంప్రెషర్లను అల్యూమినియం, రాగి సిలెండర్లలో నిక్షిప్తం చేస్తారు. కంప్రెషర్లను అత్యంత ఖరీదైన హీలియం-3, హీలియం-4 గ్యాస్‌లతో నింపుతారు. దీంతో సిలెండర్లలో మైనస్‌ 273 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వాతావరణం ఉంటుంది. ఇది చాలా ఎక్కువగా కూలింగ్‌ చేసే పద్ధతి. ఇలా చేయడం వల్ల క్వాంటమ్‌ కంప్యూటర్‌ వద్ద విపరీతమైన వేడి ఉంటుంది. కూలింగ్‌ కోసం వాడే హీలియం గ్యాస్‌ బహిరంగ మార్కెట్లో లీటరు రూ. ఐదు లక్షల దాకా ఉంటుందని నిపుణులు అంటున్నారు.ఈ మినీ క్వాంటమ్ కంప్యూటర్ టెస్ట్ బెడ్‌లు క్వాంటమ్ ఉపకరణాలను పరీక్షించేలా తోడ్పాటు అందిస్తుంది. ఇది క్వాంటం పొందికను, కచ్చితత్వాన్ని కాపాడుకోవడానికి అత్యవసరం. ఈ వ్యవస్థలు ప్రారంభ దశలో ఉన్నప్పటికీ, క్వాంటం భాగాల యొక్క కచ్చితమైన ప్రయోగాలు, ధృవీకరణను సాధ్యం చేసేలా రూపొందించబడ్డాయి. 

సంక్లిష్ట సమస్యలకు వేగవంతమైన పరిష్కారం క్వాంటమ్‌ టెక్నాలజీతో సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు.  క్లాసిక్‌ (సంప్రదాయ) కంప్యూటర్ల కంటే క్వాంటమ్‌ కంప్యూటర్ల విశ్లేషణ సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక రోగి శరీరంలోని లక్షల రకాల జన్యుపరమైన సమాచారాన్ని (డీఎన్‌ఏ డేటా), లక్షణాలను విశ్లేషించి వ్యాధిని చాలా వేగంగా గుర్తించే అవకాశం క్వాంటమ్‌తో ఉంటుందని వైద్యులు అంటున్నారు. మెడికల్‌ రంగంలో క్వాంటమ్‌ టెక్నాలజీ వినియోగం ఇంకా పరీక్షల దశలోనే ఉంది. క్వాంటమ్‌ కంప్యూటర్‌ రాకతో ఔషధ తయారీ రంగానికి పెద్ద ఊతమిచ్చినట్లవుతుందని, ఫిన్‌ టెక్‌, సప్లయ్‌ చెయిన్‌, ఇతర కాలిక్యులేషన్లలోనూ క్వాంటమ్‌ టెక్నాలజీ వేగవంతమైన సమాధానాలను ఇస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. సరికొత్త సాగు విధానాలను, పద్ధతులను రైతులకు వివరించడంలో ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని వారంటున్నారు.  

ఈ సౌకర్యాలు విద్యార్థులు, పరిశోధకులు మరియు స్టార్టప్‌లకు అందుబాటులో ఉండనున్నాయి, ఇవి అత్యంత ప్రత్యేకమైన రంగంలో ప్రత్యక్ష అనుభవాన్ని అందిస్తాయి. విదేశీ క్వాంటం మౌలిక సదుపాయాలపై ఆధారపడటాన్ని తగ్గించి, దేశీయ ఆవిష్కరణలను వేగవంతం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యం. ఇది విద్యాసంస్థలు, పరిశ్రమలు మరియు ప్రభుత్వ సంస్థల మధ్య సహకారాన్ని పెంపొందిస్తుందని భావిస్తున్నారు.క్వాంటమ్ కంప్యూటర్ ఉపకరణాలు తయారు చేసే కంపెనీలతో పాటు పరిశోధకులు, విద్యార్ధులు, నిపుణులకు ఉపయోగపడేలా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఓపెన్ యాక్సెస్ రిఫరెన్స్‌ ఫెసిలిటీని ఏర్పాటు చేయడం విశేషం. ఇది క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో ప్రత్యక్ష అనుభవాన్ని అందించనున్నాయి. విదేశీ క్వాంటమ్ మౌలిక సదుపాయాలపై ఆధారపడటాన్ని తగ్గించి... దేశీయ ఆవిష్కరణలను వేగవంతం చేసేందుకు ఇవి తోడ్పడుతాయి.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభను, పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో, అమరావతిని ‘‘క్వాంటమ్ వ్యాలీ"గా అభివృద్ధి చేసేందుకు గాను ఏపీలోని కూటమి ప్రభుత్వం సంకల్పించింది. ఉద్దండరాయుని పాలెం దగ్గర అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ 50 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్స్, క్వాంటమ్ సెన్సార్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్ వంటి కీలక రంగాల్లో ఇక్కడ పరిశోధనలు చేయడానికి ఆస్కారం ఉంది.

Also Read :  SUPER EL NINO : వ్యవసాయ రంగంపై ఎల్‌నినో ఎఫెక్ట్‌... ఖరీఫ్‌ సీజన్‌పై తీవ్ర ప్రభావం

Advertisment
తాజా కథనాలు