/rtv/media/media_files/2025/02/09/wYHGJDxCzrpJuNkckk7Z.jpg)
cm revanth reddy delhi
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Assembly Elections) ఫలితాలపై తెలంగాణ (Telangana) సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోవడానికి ఆప్ కారణమైతే.. ఢిల్లీలో ఆప్ ఓడిపోవడానికి కాంగ్రెస్ కారణమైందని సీఎం అభిప్రాయపడ్దారు. ఇండియా కూటమిలో విబేధాల కారణంగా చివరకు బీజేపీ లాభపడుతోందని సీఎం ఆరోపించారు. ఇప్పుడు ప్రజలు కేవలం అధికార, ప్రతిపక్ష పార్టీలకు మాత్రమే ఓట్లు వేస్తున్నారు కానీ మూడో పార్టీకి స్థానం ఇవ్వట్లేదని సీఎం రేవంత్ వెల్లడించారు. గతంలో ఇలా ఉండేది కాదని తెలిపారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయగా ఇప్పుడవి వైరల్ గా మారాయి. త్వరలోనే మేము ఎన్నికల ఫలితాలపై చర్చిస్తామని తెలిపారు సీఎం. సర్పంచ్ ఎన్నికలకు కూడా బీజేపీ మోడీ ముఖాన్ని వాడుతుందని.. కాంగ్రెస్ అలా చేయడం లేదన్నారు.
Also Read : నాలుకపై ఎరుపు, తెలుపు మచ్చలు క్యాన్సర్ సంకేతమా?
CM Revanth Reddy
— Naveena (@TheNaveena) February 9, 2025
“On Delhi results, In INDIA alliance everyone is expecting everything and that’s the problem. Kejriwal disturbed in Haryana and Congress did it to them in Delhi ultimately BJP is benefitting. We have to come together & plan.
Now-a-days people are voting… pic.twitter.com/0bPZd0MNAp
Also Read : వెంకీ మామ ఫ్యాన్స్ గెట్ రెడీ.. యూట్యూబ్ లో 'గోదారి గట్టు మీద' సాంగ్ ఫుల్ వీడియో
67 మంది డిపాజిట్లు గల్లంతు
ఇక ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ (BJP) 48 సీట్లతో అధికారంలోకి వచ్చింది. ఆప్ 22 సీట్లకు మాత్రమే పరిమితం అయింది. ఈ సారి కూడా కాంగ్రెస్ కనీసం ఖాతా తెరవలేకపోయింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేస్తే 67 మంది డిపాజిట్లు గల్లంతయ్యాయి. కేవలం ముగ్గురు అభ్యర్థులకు మాత్రమే డిపాజిట్లు దక్కాయి. వీరిలో కస్తూర్బా నగర్ నుంచి అభిషేక్ దత్ రెండో స్థానంలో నిలిచిన ఏకైక కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నారు. నంగ్లోయ్ జాట్ నుంచి రోహిత్ చౌదరి, బద్లి నుంచి దేవేంద్ర యాదవ్ డిపాజిట్లు దక్కించుకున్నారు.
Also Read : HIV ఉండగానే తల్లీ కూతుళ్లతో టీచర్ అక్రమ సంబంధం! చివరికి ఏమైందంటే
Also Read : సమ్మర్‌లో అదిరిపోయే టూర్.. నల్లమల్ల టూరిజం స్పెషల్ ప్యాకేజీ