/rtv/media/media_files/2025/09/25/indigo-2025-09-25-10-00-57.jpg)
indigo
IndiGo : విశాఖపట్నం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆకాశంలో ఉన్న సమయంలోనే ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఫైలట్లు అప్రమత్తమై వెంటనే ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానశ్రయం అధికారులకు సమాచారం అందించారు.
శనివారం ఇండిగోకు చెందిన బోయింగ్ 737 విమానం విశాఖపట్నం నుంచి ఢిల్లీకి బయలుదేరింది. ఈ సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. తలెత్తిన సాంకేతిక లోపం ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. గగనతలంలో ఉండగానే విమానం ఇంజిన్‌లో సాంకేతిక సమస్య ఏర్పడటంతో, పైలట్లు వెంటనే అప్రమత్తమై ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు.
ఘటన సమయంలో విమానంలో 161 మంది ప్రయాణికులు ఉన్నారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఢిల్లి విమానశ్రయంలో ఫుల్ ఎమర్జేన్సీ ప్రకటించారు. 10.53 గంటల సమయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. రన్‌వే వద్ద అగ్నిమాపక యంత్రాలు, అత్యవసర వైద్య బృందాలను సిద్ధం చేశారు. పైలట్లు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని అగ్నిమాపక అధికారులు తెలిపారు. విమానానికి కూడా ఎలాంటి నష్టం జరగలేదని వెల్లడించారు.
Follow Us