Tamilnadu Governer: స్టాలినే సీఎం.. విజయ్ కు బిగ్ షాక్ ఇచ్చిన గవర్నర్!

టీవీకే చీఫ్‌ విజయ్‌ ప్రభుత్వ ఏర్పాటుకు పర్మిషన్ కోరుతూ గవర్నర్‌ను కలిసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన 112 మంది ఎమ్మెల్యేల జాబితాను మాత్రమే అందించారు. దీంతో గవర్నర్‌ రాజేంద్ర ఆర్లేకర్‌ ప్రభుత్వ ఏర్పాటుపై మెలిక పెట్టారు.

New Update
TVK Vijay

TVK Vijay

టీవీకే చీఫ్‌ విజయ్‌(tvk vijay) ప్రభుత్వ ఏర్పాటుకు పర్మిషన్ కోరుతూ గవర్నర్‌(Tamilnadu Governer) ను కలిసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన 112 మంది ఎమ్మెల్యేల జాబితాను మాత్రమే అందించారు. దీంతో గవర్నర్‌ రాజేంద్ర ఆర్లేకర్‌ ప్రభుత్వ ఏర్పాటుపై మెలిక పెట్టారు. ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ కావాలి. అంటే విజయ్‌కు మరో 6 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ కావాలి. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు స్పష్టమైన మెజార్టీని నిరూపించుకోవాల్సిందేనని గవర్నర్‌ ఆదేశించారు. అప్పటిదాకా కేర్‌టేకర్ సీఎంగా స్టాలిన్(stalin) ఉంటారని పేర్కొన్నారు. 

Also Read :  మహిళలకు గోల్డ్, వృద్ధులకు 3 వేలు.. నిరుద్యోగులకు రూ.4 వేలు.. విజయ్ హామీలకు ఎన్ని లక్షల కోట్లు కావాలో తెలుసా?

Tamilnadu Governer Big Shock To TVK Vijay

మరోవైపు తమిళనాడు రాజకీయాలపై కూడా అమిత్‌ షా స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే --- AIADMK, TVK మధ్య పొత్తు కుదిర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కానీ బీజేపీ తమిళనాడులో ఒక్క స్థానంలో మాత్రమే గెలిచింది. AIADMKకు 47 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.  అయితే AIADMK నేత, మాజీ సీఎం పళనిస్వామి టీవీకేలో చేరే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 

పళనిస్వామి ఇంటికి టీవీకే పార్టీ కీలక నేత ఆనంద్‌ వెళ్లినట్లు తెలుస్తోంది. వీళ్ల చర్చల తర్వాత టీవీకేకు సపోర్ట్ చేసేందుకు పళనిస్వామి అంగీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సుమారు 40 మంది AIADMK ఎమ్మెల్యేలు టీవీకేకు సపోర్ట్ ఇవ్వనున్నట్లు ప్రచారం నడుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా విజయ్‌కు మద్దతిచ్చేందుకు సిద్ధమంటూ షరతులతో కూడిన లేఖ రాసింది. ఇకనుంచి ప్రతీ ఎన్నికల్లో టీవీకేతో కలిసి పోటీ చేస్తామని తెలిపింది. బీజేపీ లాంటి మతవాద శక్తుల పార్టీలతో కలవనంత వరకు టీవీకేతో కలిసి ఉంటామని స్పష్టం చేసింది. 

Also Read :  త్రిషకు విజయ్‌ బిగ్‌షాక్.. తిరుచ్చి ఈస్ట్‌ నుంచి నో టికెట్!

Advertisment
తాజా కథనాలు