/rtv/media/media_files/2026/05/04/fotojet-2026-05-04-14-06-25.jpg)
Tamil Nadu elections
Tamil Nadu Elections 2026: తమిళనాడు ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కోలీవుడ్ స్టార్ విజయ్(tvk vijay as tamilnadu cm) రాజకీయ విజయంతో పాటు, ఆయన సినిమా ‘జననాయగన్’, నటి త్రిష పుట్టినరోజు(trisha-birth-day-special) వేడుకలు సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అవుతున్నాయి.
గత కొన్ని నెలలుగా తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా నిలిచిన సినిమా ‘జననాయగన్’. విజయ్ హీరోగా నటించిన ఈ చిత్రం విడుదల సమయంలో అనేక అడ్డంకులను ఎదుర్కొంది. చివరి నిమిషంలో సినిమా ఆగిపోవడం, ఆపై సోషల్ మీడియాలో లీక్ కావడం వెనుక రాజకీయ కుట్రలు ఉన్నాయని విజయ్ స్వయంగా ఆరోపించారు. "నన్ను నేరుగా అడ్డుకోలేక, నా సినిమాను అడ్డుకున్నారు" అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రచారంలో ఓటర్లను విపరీతంగా ఆకర్షించాయి. నేడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అద్భుతమైన ఆధిక్యం సాధించడంతో, ఈ సినిమా పేరు ఎక్స్‌లో (ట్విట్టర్) టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. - tvk vijay success story
Also Read : అప్పుడు జగన్.. ఇప్పుడు మమతా.. అదే తప్పు.. అదే ఫలితం
డైలాగులతో హోరెత్తుతున్న సోషల్ మీడియా
విజయ్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని భావిస్తున్న అభిమానులు ‘జననాయగన్’ సినిమాలోని పవర్‌ఫుల్ డైలాగులను షేర్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా "పంబరేగగొట్టే వాడి పేరు వినే ఉంటావు.. అందులోనూ రికార్డులు సృష్టించే వాడి పేరు విన్నావా.. అతడే దళపతి", "నేను సాధారణ మ్యాన్‌నే.. కానీ చేసే పనులన్నీ సూపర్‌గా ఉంటాయి" వంటి డైలాగులు ఇప్పుడు నెట్టింట మారుమోగుతున్నాయి. ప్రత్యర్థులపై గురిపెట్టినట్లుగా ఉన్న "అర్హత లేనివారంతా కలిసి నిలబడ్డారు.. వాళ్లు గెలవకూడదు" అనే మాటలను విజయ్ ప్రస్తుత విజయానికి సంకేతంగా ఫ్యాన్స్ అభివర్ణిస్తున్నారు.
మరోవైపు, నటి త్రిష పేరు కూడా సోషల్ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. తన పుట్టినరోజును పురస్కరించుకుని త్రిష(actress-trisha) నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఆమెకు సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అటు విజయ్(tvk vijay party) పొలిటికల్ ఎంట్రీ సక్సెస్, ఇటు త్రిష బర్త్ డే కావడంతో తమిళ సినీ ప్రియులకు ఈ రోజు సోషల్ మీడియా వేదికగా డబుల్ సెలబ్రేషన్ లా మారింది.
Also Read : విజయ్ ఇంట్లో త్రిష బర్త్ డే సెలబ్రెషన్స్.. కేక్ కట్ చేయించిన విజయ్!
Follow Us