/rtv/media/media_files/2025/04/03/MwIbURQcKxdhS1muN6nL.jpg)
teacher-posts
పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది, పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ కింద 25,000 మందికి పైగా ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాన్ని రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సుప్రీంకోర్టు గురువారం రోజున సమర్థించింది. హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకునేందుకు సరైన కారణాలు లేవని ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి పివి సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
Also Read : నేడు ఓటీటీలోకి నాలుగు సినిమాలు.. ఆలస్యమెందుకు చూసేయండి
The Supreme Court upholds the Calcutta High Court’s decision to cancel the recruitment of more than 25,000 teachers and non-teaching staff by the SSC in 2016 for state-run and state-aided schools.
— ANI (@ANI) April 3, 2025
“We find no valid ground or reason to interfere with the decision of the High… pic.twitter.com/6KHK5XX0G3
Also Read : Cholesterol: మనిషిలో ఎంత కొలెస్ట్రాల్ ఉండాలి.. ఇంతంటే గుండెపోటు వస్తుందా?
హైకోర్టు ఉత్తర్వుల్లో మార్పులు
అయితే, హైకోర్టు ఉత్తర్వులకు అత్యున్నత న్యాయస్థానం కొన్ని మార్పులు చేసింది. ఉద్యోగులు 2016లో నియామకం అయినప్పటి నుండి వారు పొందిన జీతాన్ని తిరిగి ఇవ్వాల్సిందేనని హైకోర్టు తీర్పు ఇచ్చింది. వారు జీతం తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. మూడు నెలల్లోపు కొత్త ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. కాగా ఈ నియమకాల్లో అక్రమాలు జరిగాయని కొందరు హైకోర్టును ఆశ్రయించారు.
Also Read : ఆ 400 ఎకరాలు ఎవరు కొన్నా వెనక్కి తీసుకుంటాం..కేటీఆర్ సంచలన ప్రకటన!
Also Read : ఆ అందగత్తెతో డేటింగ్ లో ఉన్నా.. కానీ పేరు చెప్పను : శిఖర్ ధావన్
mamatha-benarjee | west-bengal-government | supreme-court | west-bengal | national news in Telugu | today-news-in-telugu | latest-telugu-news