/rtv/media/media_files/2025/04/01/OP3IB5yMNvrPxDjc1YHs.jpg)
Supreme Court raps UP govt over ‘inhuman’ demolition of houses in Prayagraj
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ప్రయాగ్‌రాజ్‌లో కూల్చిన ప్రతి ఇంటికీ పది లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ ప్రాంతంలో ఉంటున్న అడ్వకేట్ జులిఫికార్ హైదర్, ప్రొఫెసర్ అలీ అహ్మత్‌తో పాటు మరో ముగ్గురు ఇళ్లను కూల్చివేయడంపై అత్యుతున్న న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ తీసుకున్న చర్యలు చట్టవిరుద్ధమని ధ్వజమెత్తింది. ఈ కేసుల్లో ప్రతి కుటుంబానికి ఆరు వారాల్లోగా రూ.10 లక్షలు పరిహారం కేటాయించాలని ఆదేశించింది.
Also Read: తెలంగాణలో నేటి నుంచి 3 రోజులు వడగళ్ల వానలు.. ఆ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్!
పౌరుల ఇళ్లను ఇలా దారుణంగా కూల్చేయడం సరికాదని.. ఇది చట్టవిరుద్ధమని చివాట్లు పెట్టింది. ఆర్టికల్ 21లో భాగంగా నివాసం కలిగి ఉండటం పౌరులు హక్కు అని గుర్తుచేసింది. ఈ విషయాన్ని డెవలప్‌మెంట్ అథారిటీ గుర్తుంచుకోవాలని చెప్పింది. ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ఇళ్లను కూల్చివేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని తెలిపింది.
Also Read: నిత్యానంద స్వామి కన్నుమూత?
ఇదిలాఉండగా.. 2023లో యూపీ సర్కార్ బుల్‌డోజర్లతో పలు ఇళ్లను కూల్చడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా నేరస్థులు, గ్యాంగ్‌స్టర్ ఇళ్లపై ఇలాంటి చర్యలు జరిగేవి. అయితే 2023లో పోలీస్ ఎన్‌కౌంటర్‌లో అతిక్ అహ్మద్ అనే గ్యాంగ్‌స్టర్ చనిపోయాడు. దీంతో ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న పలు ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేసింది. ఈ ఇళ్లు ఉన్న భూమి గ్యాంగ్ అతిక్ అహ్మద్‌కు చెందినదే అని భావించి ఈ కూల్చివేత పనులు చేపట్టింది. అయితే ఈ ఇళ్లు ఉన్న ల్యాండ్ గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్‌కు చెందింది కాదని అడ్వకేట్ జులిఫికార్ హైదర్, ప్రొఫెసర్ అలీ అహ్మత్‌తో పాటు మరికొందరు బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ప్రయాగ్‌రాజ్‌లో కూల్చిన ప్రతి ఇంటికి ఆరు వారాల్లోగా రూ.10 లక్షలు పరిహారం కేటాయించాలని ఆదేశించింది.
Also Read: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి 7 కొత్త రూల్స్.. లిస్ట్ ఇదే!
uttar-pradesh | supreme-court | telugu-news | national-news | bulldozer