దేశ రాజధానిలో ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకోవాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు శుక్రవారం నిలిపివేసింది. ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణలో అత్యున్నత న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆయుష్మాన్ భారత్ పథకం అమలు కోసం కేంద్రంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ఆప్ ప్రభుత్వాన్ని ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి :ఖేల్ రత్న అవార్డ్‌లు ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము
ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ పథకం అమలును కేజ్రీవాల్ ప్రభుత్వం వ్యతిరేఖించింది. ప్రభుత్వం న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సుప్రీంకోర్టుకు హాజరై కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాల మధ్య అధికార భాగస్వామ్యాన్ని హైకోర్టు పునర్నిర్వచించిందని విచారణలో వినిపించారు. దీంతో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలకు సుప్రీం కోర్టు బ్రేక్ వేసింది.
కేంద్ర ప్రభుత్వంతో ఎంఓయూపై సంతకం చేయమని విధానపరమైన విషయాలపై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా బలవంతం చేస్తుందని అడ్వకేట్ వాదించారు. ఆయూష్మాన్ భారత్ స్కీమ్ అమలు చేస్తే.. ప్రస్తుతం అమలులో ఉన్న ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలను తగ్గుతాయని ఆప్ గవర్నమెంట్ చెబుతుంది.
Also Read: Gaza: కాల్పుల విరమణ తర్వాత కూడా ఇంకా దాడులు ..100 మంది మృతి!
ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన కింద 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు సంవత్సరానికి రూ.5 లక్షల క్యాష్ లెస్ హెల్త్ కవరేజ్ అందిస్తుంది. ఇదే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ఢిల్లీలో ఈ స్కీమ్ అమలు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల జరుగుతన్న వేళ బీజేపీ, ఆప్ పార్టీల మధ్య విమర్శలు మరింత ముదురుతున్నాయి.