యాపిల్ కంపెనీ కో ఫౌండర్ దివంగత స్టీవ్ జాబ్స్ భార్య లారీన్ పావెల్ జాబ్స్ మహాకుంభమేళాకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె అస్వస్థకు గురయ్యారు. అలాగే అలెర్జీలు కూడా వచ్చాయి. వాతావరణం కొత్త కావడం వల్ల ఆమె అస్వస్థకు గురైనట్లు నిరంజమీ అఖాడాకు చెందిన కైలాసానంద గిరి మహరాజ్ అనే స్వామి తెలిపారు. ప్రస్తుతం లారీన్ తాము ఏర్పాటు చేసిన శిబిరంలో చికిత్స తీసుకుంటున్నారని.. ఆరోగ్యం కుదుటపడ్డాక త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరిస్తారని పేర్కొన్నారు.
Also Read: నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభం..
ఇదిలాఉండగా.. మహాకుంభ మేళాలో పాల్గొనేందుకు లారీన్ ప్రయాగ్ రాజ్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమె పలు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహాకుంభమేళా విజయవంతంగా జరగాలని తాను భగవంతుడిని కోరుకున్నట్లు లారీన్ తెలిపారు. అంతేకాదు ఆమె తన పేరును కమలగా కూడా మర్చుకున్నట్లు కైలాసానంద గిరి మహరాజ్ చెప్పారు. లారీన్ భారత్‌కు రావడం రెండోసారని, ధ్యానం చేసేందుకు తమ ఆశ్రమానికి వస్తుంటారని పేర్కొన్నారు.
Also Read: ఇది గేమ్ ఛేంజర్ సంక్రాంతి.. తెలంగాణలో పాలిటిక్స్ లో రానున్న ఊహించని మార్పులివే!
ఇదిలాఉండగా మాహా కుంభమేళా జనవరి 13న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26 వరకు ఈ ఉత్సవం కొనసాగుతుంది. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు కుంభమేళాకు తరలివస్తున్నారు. యూపీ ప్రభుత్వం కూడా భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. మరోవైపు ఈ కుంభమేళా కార్యక్రమం వల్ల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి రూ.2 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Also Read: నేడే అయ్యప్ప మకరజ్యోతి దర్శనం..శబరిమలకు పోటెత్తిన స్వాములు
Also Read: లాస్ ఏంజిల్స్‌లో ఆగని కార్చిచ్చు.. మరింత ప్రమాదం పొంచిఉందంటున్న అధికారులు