/rtv/media/media_files/2025/03/01/yzPENNRhTWO86atzVPvX.jpg)
Punjab Police
ప్రస్తుత సమాజంలో విచ్చలవిడిగా మాదక ద్రవ్యాల వినియోగం పెరిగిపోయింది. ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా ఇవి ఆగడం లేదు. అయితే మాదక ద్రవ్యాల కట్టడికి పంజాబ్ ప్రభుత్వం నడుం బిగించింది. మూడు నెలల్లోగా పంజాబ్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని సీఎం భగవంత్ మాన్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే పోలీసులు డ్రగ్స్ వినియోగంపై ఉక్కుపాదం మోపారు. దాదాపు 12 వేల మంది సిబ్బంది శనివారం రాష్ట్రవ్యాప్తంగా 750కి పైగా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.
Also Read: యూఎస్ ఎయిడ్ నిలిపివేత.. భారత్‌లో మూతపడ్డ ఆ క్లినిక్‌లు
8 కిలోలకు పైగా హెరాయిన్, 16 వేలకు పైగా మత్తు మాత్రలు, గంజాయి ఇతరత్రా వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 232 కేసులు నమోదు చేసి.. 290 మంది స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. మరోవైపు డ్రగ్స్ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వ చర్యలను పర్యవేక్షించడం కోసం ఏర్పాటైన కేబినెట్ ఉపసంఘం శనివారం తొలిసారిగా సమావేశాన్ని నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మాదక ద్రవ్యాల నిరోధక కార్యక్రమానికి సపోర్ట్ ఇవ్వాలని మంత్రి అమన్ అరోడా అన్ని రాజకీయ పార్టీలకు కూడా కోరారు.
Also Read: పక్కన ఇద్దరుండగానే మూడో వాడికి ముద్దులు.. మద్యం మత్తులో యువతి హల్ చల్!
ఇది ప్రభుత్వానికో లేదా పార్టీకో చెందిన సమస్య కాదని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై రాజకీయాలు చేయడం మానుకోవాలని తెలిపారు. మరోవైపు కేబినేట్ ఉపసంఘం భేటీ తర్వాత రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హర్‌పాల్ సింగ్ మాట్లాడారు. మాదక ద్రవ్యాలపై ఆప్ ప్రభుత్వం యుద్ధం ప్రకటించినట్లు పేర్కొన్నారు. త్వరలోనే రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మారుస్తామని.. ఒక్క డ్రగ్ పెడ్లర్ కూడా కనపించబోరని చెప్పారు. అలాగే పోలీసు చర్యలను పర్యవేక్షించేందుకు కేబినెట్ ఉపసంఘం సభ్యులకు వివిధ జిల్లాలకు కూడా కేటాయించినట్లు పేర్కొన్నారు .
Also Read: పక్కన ఇద్దరుండగానే మూడో వాడికి ముద్దులు.. మద్యం మత్తులో యువతి హల్ చల్!
Also Read: నువ్వేం మంచి చేశావని మైకులో చెప్తరు..రేవంత్ పై కేటీఆర్ ఎద్దేవా