ఈ ఏడాది జనవరి 13 నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరగనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అయితే తాజాగా రైల్వేశాఖ కీలక ప్రకటన చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్లేవారి కోసం అదనంగా మరో 26 ప్రత్యేక రైలు సర్వీసులు నడిపించననున్నట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, మచీలిపట్నం, విజయవాడ, కాకినాడ టౌన్ నుంచి ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. Also Read: మనమందరం సిగ్గు పడాలి.. మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు ఇక తెలంగాణలో వికారాబాద్, సికింద్రాబాద్, మౌలాలి జంక్షన్ల నుంచి ఈ స్పెషల్ ట్రైన్లు వెళ్లనున్నాయి. మరోవైపు భక్తుల అవసరాలు, భద్రత కోసం యూపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ మహాకుంభమేళాకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 45 కోట్ల మంది రానున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలాఉండగా.. మహాకుంభమేళా కోసం మొత్తం 13 వేల రైళ్లను నడపనున్నట్లు ఇటీవలే రైల్వేశాఖ మంత్రి అశ్విని వెష్ణవ్ ప్రకటించారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా జరగనుంది. అయితే ఈ వేడుకకు దాదాపు 1.5 కోట్ల నుంచి 2 కోట్ల మంది రైళ్ల ద్వారా అక్కడికి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. Also Read: ప్రేమికురాలి కోసం పాకిస్థాన్‌కు వెళ్లిన యూపీ వాసి.. చివరికీ ఊహించని షాక్ మరోవైపు కుంభమేళా కోసం రైల్వేశాఖ చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించేందుకు అశ్వినీ వైష్ణవ్ ఇటీవల వారణాసి నుంచి రైలు మార్గంలో ప్రయాగ్‌రాజ్‌కు ప్రయాణించారు. అలాగే మార్గమధ్యంలో ఇటీవల గంగానదిపై నిర్మించిన కొత్త బ్రిడ్జిని కూడా పరిశీలించారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే ఈ కొత్త వంతెనను ప్రారంభించనున్నట్లు తెలిపారు. దాదాపు 100 ఏళ్ల తర్వాత ఈ గంగానదిపై తమ ప్రభుత్వం కొత్త బ్రిడ్జిని నిర్మించిందని పేర్కొన్నారు. Also Read: ఆ సమాయానికి మోదీ ప్రభుత్వం ఉండకపోవచ్చు.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు