గణతంత్ర దినోత్సవ వేడుకల్లో స్పెషల్ గెస్ట్.. ఎవరంటే?

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కేరళలో గిరిజన తెగకు చెందని ఓ రాజును కేంద్రం ఆహ్వానించింది. మణ్ణన్‌ తెగకు చెందిన రాజు రామన్‌ రాజమణ్ణన్‌. ఒక గిరిజన రాజును భారత రిపబ్లిక్‌ డే వేడుకలకు ఆహ్వానించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

New Update
Raman Rajamannan

Raman Rajamannan Photograph: (Raman Rajamannan)

భారత 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోను ఆహ్వానించడంతోపాటు దేశంలోని పలువురిని అతిథులుగా ఆహ్వానించారు.

ఓ గిరిజన రాజు ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో స్పెషల్ ఇన్విటేషన్  ఇచ్చారు. ఆయన పూర్తి పేరు రామన్‌ రాజమణ్ణన్‌. కేరళలో మణ్ణన్‌ తెగకు ఆయన రాజు. ఆదివారం భారత 76వ గణతంత్ర వేడుకలకు హాజరైన అతిథుల్లో ఆయన కూడా ఒకరు. కేంద్రం తరఫున షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి ఓఆర్‌ కేలు ఆయనను వేడుకలకు ఆహ్వానించారు. ఒక గిరిజన రాజును భారత రిపబ్లిక్‌ డే వేడుకలకు ఆహ్వానించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Also Read: రిపబ్లిక్‌ డే కవాతులో అదరగొట్టిన ‘నారీశక్తి’..

రాజమణ్ణన్‌ కేరళలో ఉన్న ఏకైక గిరిజన రాజు. కేంద్రం ఆహ్వానం మేరకు గత బుధవారం ఆయన తన సతీమణితో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు. రిపబ్లిక్‌ డే వేడుకల్లో ఓఆర్‌ కేలు మణ్ణన్‌ సామాజిక వర్గానికి చెందిన సంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యారు. రాజమణ్ణన్‌ మణ్ణన్‌ సామాజిక వర్గానికి చెందిన 300 కుటుంబాలకు రాజుగా వ్యవహరిస్తున్నాడు. ఇడుక్కి జిల్లాలో అతను నివాసం ఉంటున్నాడు. మణ్ణన్‌ తెగకు చెందిన వివిధ కార్యక్రమాలు, పండుగల్లో రాజుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. రామన్‌ రాజమణ్ణన్‌ 2012లో ఆర్యన్‌ రాజమణ్ణన్‌ మరణించినప్పటి నుంచి తన తెగను పరిపాలిస్తున్నారు.

Also Read: ఆస్తులమ్మి భార్యను చదివిస్తే.. జాబ్ వచ్చాక భర్తను వదిలేసింది.. అబ్బో చివరికి ట్విస్ట్ అదుర్స్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు