/rtv/media/media_files/2026/04/03/raghav-chadha-2026-04-03-14-45-01.jpg)
Silenced, not defeated, Raghav Chadha video message blows the lid off AAP rift
రాజ్యసభ(rajyasabha) లో ఆమ్‌ఆద్మీ పార్టీ (AAP) డిప్యూటీ లీడర్‌గా రాఘవ్ చడ్డాను తొలగించడం దుమారం రేపుతోంది. సోషల్ మీడియాలో ఆయనకు చాలామంది సపోర్ట్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఎంపీ రాఘవ్ చడ్డా స్పందించారు. తాను ఏం తప్పు చేశానని పార్టీని నిలదీశారు. ఇలాంటి ప్రయత్నాల వల్ల తన గొంతును అణిచివేయలగలరేమో గానీ తనను ఓడించలేరంటూ వీడియోను రిలీజ్ చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ '' పార్లమెంట్‌లో నాకు ఎప్పుడు మాట్లాడే ఛాన్స్ వచ్చినా ప్రజల సమస్యల గురించే మాట్లాడుతాను.
Also Read: CA నుంచి రాజ్యసభ దాకా: ఆప్ ఎంపీ ఆస్తుల లెక్క ఎంతంటే?
Raghav Chadha Video Message
నేను మాట్లాడే విషయాలను సభలో సాధారణంగా చర్చించరేమో. ప్రజా సమస్యల గురించి మాట్లాడటం ఏదైనా నేరమా ? నేను ఏమైనా తప్పు చేశానా ?. పార్లమెంట్‌లో తనకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వొద్దని పార్టీ స్వయంగా రాజ్యసభ సెక్రటరీకి చెప్పేసింది. ఎయిర్‌పోర్టులో ఫుడ్ ధరలు, గిగ్ వర్కర్ల సమస్యలు, టోల్ ప్లాజాలు చేస్తున్న దోపిడి, టెలికాం కంపెనీల రీఛార్జ్ విధానాల సమస్యలను ఎత్తిచూపాను. ఇలా ప్రశ్నించడం ఆప్‌కే ప్రయోజనం కదా. దీనివల్ల జరిగే నష్టం ఏంటి ?. నన్ను మాట్లాడనీయకుండా ఎందుకు ఆపుతున్నారు. ? నా గళాన్ని మీరు అణిచివేయొచ్చు. కానీ నా ఓటమిని మాత్రం కాదు. నావైపు ప్రజలు ఉన్నారు. వాళ్లకోసం ఎంతదూరమైనా వెళ్తాను. సమయం వచ్చినప్పుడు వరదలా మరింత ఉద్ధృతంగా ప్రశ్నిస్తానంటూ'' మాట్లాడారు.
Raghav Chadha issues first response after AAP moves to remove him as Rajya Sabha deputy leader, saying he has been “silenced, not defeated,” in a message to the Aam Aadmi Party “खामोश करवाया गया हूँ, हारा नहीं हूँ.” https://t.co/NBEBby27ltpic.twitter.com/FUNMGJXxPw
— Gagandeep Singh (@Gagan4344) April 3, 2026
Also Read: అంతరిక్షంలోనూ అవుట్‌లుక్ తిప్పలు.. చంద్రుడి వైపు వెళ్తూ సాఫ్ట్‌వేర్ కష్టాలు!
ఇదిలాఉండగా ఆమ్‌ఆద్మీ పార్టీ రాఘవ్ చడ్డాను డిప్యూటీ లీడర్‌గా తొలగించింది. ఆయన హోదాను మరో ఎంపీ అశోక్ మిత్తల్‌కు అప్పగించింది. ఆప్ చేస్తున్న కార్యకలాపాలకు రాఘవ్ చడ్డా దూరంగా ఉండటం, పార్టీకి సంబంధించిన కార్యక్రమాలపై స్పందించకపోవడం లాంటి వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆప్ వెల్లడించింది. మరోవైపు రాఘవ్ చడ్డా బీజేపీలో చేరనున్నట్లు ఊహగాణాలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో రాఘవ్ చడ్డాను డిప్యూటీ లీడర్‌గా తొలగించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Follow Us