బడ్జెట్‌ కేటాయింపులపై షర్మిల, కవిత ఫుల్ ఫైర్

2025 బడ్జెట్‌పై TG ఎమ్మెల్సీ కవిత, APCC ప్రెసిడెంట్ షర్మిల అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్‌ కేటాయింపులో రాష్ట్రాలకు అన్యాయం జరిగిందన్నారు. పసుపు బోర్డుకు గుండు 0 అని కవిత అంటే.. ఇది యూనియన్ బడ్జెట్ కాదు బీహార్ ఎన్నికల బడ్జెట్ అని షర్మిల ఎద్దేవా చేశారు.

New Update
ys sharmila, kavitha

ys sharmila, kavitha Photograph: (ys sharmila, kavitha)

రానున్న ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ కేటాయింపులపై APCC ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత లు విమర్శల వర్షం కురిపించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్‌లో యూనియన్ బడ్జెట్ 2025ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ బడ్జెట్‌పై కవిత, షర్మిల నిప్పులు చెరిగారు. స్పైసెస్ బోర్డు, టీ బోర్డు, కాఫీ బోర్డు, రబ్బర్ బోర్డులకు నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం.. పసుపు బోర్డుకు మాత్రం ఒక రూపాయి కూడా కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తి చేశారు. ఎక్స్ వేదికగా ఆమె నిజామాబాద్ బోర్డు పసుపు బోర్డుకు గుండు సున్నా అని పోస్ట్ చేశారు.

పసుపు బోర్డు ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న బిజెపి ప్రభుత్వం, మరి దానికి బడ్జెట్ లో నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. నిజామాబాద్ రైతాంగాన్ని కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని ధ్వజమెత్తారు. నిధులు లేని పసుపు బోర్డు ఎలా పనిచేస్తుందని, ఏం పరిశోధనలు చేస్తోందని ఆమె నిలదీశారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు 8, బీజేపీ కి 8 మంది ఎంపీలను ఇస్తే.. బడ్జెట్ కేటాయింపులో మాత్రం రాష్ట్రానికి అన్యాయం చేశారని అన్నారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలకు 8 మంది చొప్పున ఎంపీలు ఉన్నా సాధించిన నిధులు మాత్రం సున్నా అన్ని ఎక్స్ లో పేర్కొన్నారు. తెలంగాణ పట్ల బీజేపీకి చిత్తశుద్ధి లేదని ఈ బడ్జెట్‌తో తేటతెల్లమైందని కవిత అన్నారు.

అలాగే.. కాంగ్రెస్ ప్రభుత్వం తన అసమర్ధతను మరోసారి నిరూపించుకుందని ఎద్దేవా చేశారు. సుదీర్ఘకాలంగా తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తున్న ఐఐఎం సంస్థ ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకపోవడం దారుణం అన్నారు. బ్రిటిష్ వారి పరిపాలనలో చేనేతపై పన్ను విధించలేదని, కానీ బిజెపి ప్రభుత్వం పన్ను విధించిందని, దాన్ని రద్దు చేయాలని దేశవ్యాప్తంగా అనేక ఆందోళనలు జరుగుతున్నా కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు.

‘బీహార్ ఎన్నికల బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులా’

ఇక ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ముఖ్య ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల ఇది యూనియన్ బడ్జెట్ కాదు.. బీహార్ ఎన్నికల బడ్జెట్ అని అన్నారు. బీహార్‌కి ఫుల్, ఏపీకి నిల్ అని ఆమె అధికారిక ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. నరేంద్ర మోడీ గారి బీహార్ ఎన్నికల బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు అని ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రభుత్వం తీరు కొండంత రాగం తీసి కూసంత పాట పాడినట్లుందని విమర్శల వర్షం కురిపించారు.

ఎన్డీయే భాగస్వామ్య పక్షంలో 12 మంది ఎంపీలు ఉన్న బిహార్ బడ్జెట్‌లో అగ్రతాంబూలం అందుకుంటే.. 21 మంది ఎంపీలతో పెద్దన్న పాత్ర పోషించే చంద్రబాబుకి ప్రధాని మోడీ చిప్ప చేతిలో పెట్టారని షర్మిల అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని, ఏపీ ప్రజల మద్దతుతో గద్దెనెక్కి రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారని ఆమె మండిపడింది. బడ్జెట్‌లో ఈ సారి కూడా హోదా ప్రస్తావన లేకుండా రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బ తీశారన్నారు. పోలవరం అంచనాలకు ఆమోదం అన్నారే కానీ బడ్జెట్‌లో ఆశించిన ఫలితం దక్కలేదని చెప్పారు.

విభజన హామీలను తుంగలో తొక్కారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక నిధులు లేవు. రాష్ట్రానికి ప్రత్యేక పరిశ్రమలు కేటాయించలేదు. మెట్రో రైల్ ప్రాజెక్టును పట్టించుకోలేదు. కడప స్టీల్ ఊసే లేదని ఆంధ్ర ప్రదేశ్ కు అరకొర కేటాయింపులే అని 2025 బడ్జెట్ కేటాయింపులపై అసహనం వ్యక్తం చేశారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. ఇంత అన్యాయం జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు బడ్జెట్‌ను ప్రగతిశీల బడ్జెట్ అని స్వాగతించడం హాస్యాస్పదని ఆమె ఫైర్ అయ్యారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఛీఛీ ఇంతకు దిగజారడం.. ఏకంగా కుక్కపైనే అత్యాచారం!

యజమాని స్వగ్రామానికి వెళ్తూ పార్కింగ్‌లో ఉన్న కుక్కను చూడమని చెప్పారు. దీంతో ఆ వ్యక్తి కుక్కపై అత్యాచారం చేశాడు. కుక్క ఏడుస్తుండటం వల్ల సీసీటీవీ చెక్ చేయగా విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆ వ్యక్తిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

New Update
Pune dog rape

Pune dog rape Photograph: (Pune dog rape)

రోజురోజుకీ అత్యాచారాల రేటు పెరిగిపోతుంది. కొందరు నీచులు ఆఖరికి జంతువులను కూడా వదలడం లేదు. వివరాల్లోకి వెళ్తే.. పూణేలోని హండేవాడి ప్రాంతంలో ఓ ఆడ కుక్కపై అత్యాచారం చేసినందుకు 20 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చంద్రశేఖర్ యాదవ్ అనే వ్యక్తి మధుబని జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్లాడు. ఈ క్రమంలో తన పక్కింటి వాళ్ల దగ్గర తన ఐదేళ్ల ఆడ లాబ్రడార్ (కుక్క)ను పార్కింగ్ ప్రాంతంలో ఉంచారు. తాను వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు.

ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

కుక్క తరచుగా ఏడవడంతో..

కొన్ని రోజుల నుంచి కుక్క తరచుగా ఏడుస్తోంది. దీంతో పొరుగింటి వారు యజమానికి చెప్పడంతో వెంటనే చంద్రశేఖర్ సీసీటీవీ ఫుటేజ్ చూశారు. ఆ సమయంలో సీసీటీవీ ఫుటేజ్‌ను క్షుణ్నంగా చూడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. అలీముద్దీన్ అమినల్ షేక్‌ అనే వ్యక్తి కుక్కతో ఆడుకున్నాడు. ఆ తర్వాత ఓ చీకటి ప్రదేశానికి తీసుకెళ్లి దానిపై అత్యాచారం చేసినట్లు గుర్తించారు. దీంతో పోలీసులు అతనిపై బీఎన్‌ఎస్ సెక్షన్ 329, జంతువులపై క్రూరత్వం నివారణ చట్టం, 1960 సెక్షన్ 11(1)(a) కింద కేసు నమోదు చేశారు. 

ఇది కూడా చూడండి: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

ఇదిలా ఉండగా ఓ వ్యక్తి వీధి కుక్కలపై రేప్ చేశాడు. ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు 13 కుక్కలను రేప్ చేశాడు. ఈ ఘటనతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆ కామాంధుడి పేరు నౌషాద్. ఈ రేపిస్ట్ నౌషాద్ ఓ వీధికుక్కను అత్యాచారం చేస్తుండగా.. కొంతమంది స్థానికులు అతడ్ని పట్టుకున్నారు. 

ఇది కూడా చూడండి: TS: భూభారతిపై అవగాహనా సదస్సులు..సీఎం రేవంత్ రెడ్డి

అనంతరం అతడికి దేహశుద్ది చేశారు. ఆపై ఇలా ఎన్ని కుక్కలపై అఘాయిత్యాలు చేస్తున్నావని ఆరా తీశారు. అందుకు సంబంధించిన వీడియోలతో పాటు అతడు వీధి కుక్కలను రేప్ చేశాడు.

ఇది కూడా చూడండి:  AP Crime News : అక్క ఇంటికే కన్నం వేసిన చెల్లెలు...లక్షల విలువచేసే బంగారంతో…

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు