/rtv/media/media_files/2025/03/04/2065VwwDJAkNwAxSSPL9.jpg)
Supreme Court
Social Media: 13 ఏళ్లలోపు ఉండే పిల్లలు సోషల్ మీడియా వాడకుండా చట్టబద్ధమైన నిషేధం విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఇటీవల ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై తాజాగా విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. ఇది పాలసీకు సంబంధించిన విషయమని.. దీనిపై చట్టం చేయాలని పార్లమెంట్‌ను కోరండని సూచించింది. ప్రస్తుతం దాఖలు చేసి ఈ పిటిషన్‌ను స్వీకరించలేమని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహ్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది.
Also Read: స్టాలిన్‌కు షాక్.. నీట్ వ్యతిరేక బిల్లును తిరస్కరించిన రాష్ట్రపతి
పిటిషనర్లు సంబంధిత విభాగానికి వినతి చేయాలని చెబుతూ ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. ఒకవేళ ఇప్పటికే సంబంధిత విభాగానికి ఆర్జీ పెట్టుకొని ఉంటే వాళ్లు దాన్ని 8 వారాల్లో పరిష్కరించాలని తెలిపింది. ఇదిలాఉండగా.. జెప్ ఫౌండేషన్ కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసింది. సోషల్ మీడియాలో బలమైన వెరిఫికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం.. ఇతరులకు గైడ్‌లైన్స్ ఇవ్వాలని కోరింది.
పిల్లల భద్రత కోసం..
అలాగే 13 ఏళ్ల లోపు చిన్నారులకు సోషల్ మీడియాలో యాక్సెస్‌ను నియంత్రించాలని విజ్ఞప్తి చేసింది. న్యాయవాది మోహిని ప్రియా పిటిషనర్ల తరఫున వాదించారు. పిల్లల భద్రత కోసం ఏర్పాటు చేసిన నిబంధనలు ఉల్లంఘించిన సోషల్ మీడియా సంస్థలకు భారీగా ఫైన్ విధించాలని పిటిషినర్లు కోరారు. కానీ అత్యున్నత న్యాయస్థానం ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. ఇది పాలసీకు సంబంధించిన విషయమని.. దీనిపై చట్టం చేయాలని పార్లమెంట్‌ను కోరండని సూచించింది.
Also Read: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టుకు కాంగ్రెస్ పార్టీ
telugu-news | rtv-news | national-news
Also Read: Crime News: ఐదుగురు మహిళలతో నటుడు అక్రమ సంబంధం.. 64 ఏళ్ల వయసులో మారని బుద్ధి!