Saif Ali Khan: ముంబయ్‌లో ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్‌పై ఓ దుండగుడు దాడి చేసిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. నిందితుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి తాజాగా మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఆ దుండగుడు సైఫ్ ఇంట్లో చొరబడ్డాక ఆయనపై దాడి చేశాడు. ఆ సమయంలో అక్కడ నలుగురు మగ పనిమనుషులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దుండగుడు, సైఫ్‌కు మధ్య ఫైట్ జరుగుతున్నప్పుడు ఆ నలుగురు ఆపేందుకు ప్రయత్నించలేదు. భయంతో అక్కడే దాక్కున్నారు. అయినప్పటికీ సైఫ్ అలీ ఖాన్ ఒక్కడే ఒంటరిగా ఆ దుండగుడితో పోరాడినట్లు ఓ జాతీయ మీడియా తెలిపింది.
ఇది కూడా చదవండి: Divya : రాజకీయాల్లోకి కట్టప్ప కూతురు.. డీఎంకేలో కీలక పోస్ట్!
సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan ) ఇల్లు అన్న విషయం దొంగకు తెలియదు...
ఇదిలాఉండగా.. ఈ ఘటనపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దుండగుడికి అది సైఫ్ అలీ ఖాన్ ఇల్లు అని తెలియదని పేర్కొన్నారు. '' అతడు ఒక దొంగ. బంగ్లాదేశ్‌కు చెందినవాడు. ముందుగా కోల్‌కతాకు చేరుకొని ఆ తర్వాత ముంబయికి వచ్చాడు. దొంగతనం చేసేందుకు ఓ ఇంటిని ఎంచుకున్నాడు. ఇందులో భాగంగానే సైఫ్ ఇంట్లో చొరబడ్డాడు. అది సైఫ్ అలీ ఖాన్ ఇల్లు అన్న విషయం ఆ దొంగకు తెలియదు. విపక్ష పార్టీలు మా ప్రభుత్వం వైఫల్యం వల్లే దాడి జరిగిందని చెప్పడం సరైంది కాదు. ముంబైలో లా అండ్ ఆర్డర్ విఫలమైందని విపక్ష పార్టీలు పదే పదే ఆరోపణలు చేయడం సరికాదు. ఇలా విమర్శంచడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని'' అజిత్ పవార్ అన్నారు.
ఇది కూడా చదవండి: లోకేష్ డిప్యూటీ సీఎం.. TDP హైకమాండ్ సంచలన ప్రకటన!
మరోవైపు దీనికి సంబంధించి ముంబయి జోన్ 9 డీసీపీ దీక్షిత్ గెడం సైతం మీడియాతో మాట్లాడారు. '' నిందితుడి పేరు మహ్మద్ షరీఫుల్ షెహజాద్. విజయ్ దాస్‌గా అందరికీ తన పేరు చెప్పుకుంటున్నాడు. 6 నెలల క్రితమే ఫేక్ పత్రాలతో ఇండియాలో చొరబడ్డాడు. కొన్నాళ్ల నుంచి ముంబయిలో ఓ బార్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్నాడు. దొంగతనం చేసేందుకే సైఫ్ అలీఖాన్ ఇంట్లో చొరబడ్డాడు. కొన్నిరోజులు ఓ హౌస్ కీపింగ్ ఏజెన్సీలో కూడా పనిచేశాడు. ఆ సమయంలోనే సైఫ్ ఇంటికి వెళ్లినట్లు అనుమానాలున్నాయి. వీటికి సంబంధించిన ఆధారాలు స్వాధీనం చేసుకున్నాం. ప్రస్తుతం అతడిపై విచారణ జరుగుతోందని'' దీక్షిత్ గెడం తెలిపారు.
ఇది కూడా చదవండి: ఇండియన్ ఆర్మీ వరల్డ్ రికార్డ్ !.. 40 మంది, 20 ఫీట్ల ఎత్తులో రైడింగ్
ఇది కూడా చదవండి: జ్యూస్లో విషం కలిపి లవర్ను చంపిన కిలాడీ.. కోర్టు సంచలన తీర్పు