/rtv/media/media_files/2025/02/28/HN97ra0V2zIQRc3HnUtz.jpg)
Relief for Isha Foundation as Supreme Court dismisses TNPCB’s plea on environmental violations
ఈశా ఫౌండేషన్ (Isha Foundation) అక్రమ నిర్మాణాల ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. తాజాగా దీనిపై విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఈశా ఫౌండేషన్‌కు ఊరట కల్పించింది. అ అంశంలో మద్రాస్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులో తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది. ఈశా ఫౌండేషన్‌పై బలవంతపు చర్యలు తీసుకోవద్దని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్‌ల ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
Also Read: ఉత్తరాఖండ్‌లో దారుణం.. హిమపాతంలో చిక్కుకున్న 57 మంది కార్మికులు
Big Relief To Isha Foundation
ఇక వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని వెల్లియంగిరిలో ఈశా ఫౌండేషన్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఫౌండేషన్ అక్రమంగా ఏర్పాటు చేశారని.. ఎలాంటి పర్యవరణ అనుమతులు తీసుకోకుండానే నిర్మించినట్లు తమిళనాడు కాలుష్య నియంత్రణ బోర్డు(TNPCB) ఆరోపణలు చేసింది. అంతేకాదు దీనికి సంబంధించి నోటీసులు జారీ చేసింది. దీంతో తమకు వచ్చిన నోటీసులపై ఈశా ఫౌండేషన్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేసింది.
Also Read: గజగజ వణికిస్తున్న భారీ అగ్ని ప్రమాదం.. 42వ అంతస్తులో ఎగసిపడిన మంటలు!
మద్రాసు హైకోర్టు (Madras High Court) ఈశా ఫౌండేషన్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. TNPCB నోటీసులను కొట్టివేసింది. రూల్స్ ప్రకారమే ఫౌండేషన్ నిర్మాణం జరిగినట్లు స్పష్టం చేసింది. కానీ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు మాత్రం ఇంతటితో ఆగలేదు. చివరికీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే అత్యున్నత న్యాయస్థానం కూడా ఈశా ఫౌండేషన్ వైపే సానుకూలత చూపింది. యోగా, ధ్యాన కేంద్రం పర్యావరణ నిబంధనలు, కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాల మేరకే నిర్మాణం జరిగినట్లు పేర్కొంది. అలాగే ఫౌండేషన్‌పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని TNPCBకి ఆదేశాలు జారీ చేసింది.
Also Read: కూతురివా రాక్షసివా?.. తల్లిని ఇంతలా ఏడిపిస్తారా? హార్ట్ బ్రేకింగ్ వీడియో!
Also Read: ఇడ్లీ-సాంబార్ గోవా టూరిజాన్ని నాశనం చేసింది.. బీజేపీ ఎమ్మెల్యే సంచలనం!