/rtv/media/media_files/2025/02/19/qOzgqCqnFsYPBE2fLdos.jpg)
Rekha Gupta delhi Women Cm Photograph: (Rekha Gupta delhi Women Cm)
రేఖా గుప్తాఢిల్లీ రాజకీయాల్లో 27ఏళ్ల బీజేపీ కలకు ప్రతిరూపం. షాలిమార్ బాగ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థిపై 30 వేల ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తా ఘన విజయం సాధించారు. కేజ్రీవాల్‌ను ఓడించిన మాజీ సీఎం కొడుకు, పర్వేశ్ శర్మను కాదని ఆమెకే ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తున్నారంటే ఆమె గొప్పతనం అక్కడే అర్థం చేసుకోవచ్చు. విద్యార్థి దశ నుంచే ఆమె పార్టీలో పని చేస్తూ వచ్చారు. ఇప్పటి వరకు ఢిల్లీ పీఠాన్ని నలుగురు మహిళలు అధిరోహించారు. అందులో నాలుగో వారే రేఖా గుప్తా.
Also Read : Delhi CM Rekha Gupta : ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా.. బీజేపీ MLAలు ఏకగ్రీవం
రేఖా గుప్తా మూడు సార్లు ఢిల్లీ ఉత్తరి పితంపుర (54 వార్డ్) కౌన్సిలర్‌గా గెలిచారు. అంతేకాదు ఆమె దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (SDMC) మాజీ మేయర్. ప్రస్తుతం బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఆమె ఏకైనా మహిళా ముఖ్యమంత్రిగా ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి షీలా దీక్షిత్, బీజేపీలో సుష్మా స్వరాజ్, ఆమ్ ఆద్మీ పార్టీలో అతిషి మార్లెనా సింగ్ ఢిల్లీ ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టన మహిళలు.
కౌన్సిలర్ నుంచి డెరెక్ట్.. ముఖ్యమంత్రి
ఆమె ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ రాజకీయ అనుభవం చాలానే ఉంది. ఢిల్లీ యూనివర్సిటీలో చుదువుకునే రోజుల్లోనే ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. దౌలత్ రామ్ కాలేజ్ నుంచి ఆమె గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి, అధ్యక్షురాలుగా రేఖా గుప్తా పని చేశారు. మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, ఢిల్లీ రాష్ట్ర విభాగం ప్రధాన కార్యదర్శిగా కూడా గతంలో ఆమె బాధ్యతలు నిర్వహించారు.
Also Read : Yashtika Acharya: 270Kg బరువు మెడపై పడి.. జిమ్‌లోనే కుప్పకూలిన అథ్లెట్ (viral video)
ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్
రేఖా గుప్తా 1974లో హర్యానాలోని జింద్ జిల్లాలో నంద్‌గఢ్ గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్‌గా పని చేశారు. వారి కుటంబం ఢిల్లీకి వలస వచ్చారు. 1996లో రేఖా గుప్తా LLB పట్టా పొందారు.