/rtv/media/media_files/2025/01/10/fOm5XmKPSVozpAOWvDMl.jpg)
Modi, Amit Shahm Priyanka Gandhi and Mahua Moitra
Squid Game: ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అదరగొడుతున్న వెబ్‌సిరీస్ స్క్విడ్‌గేమ్ సీజన్ -2. ఈ వెబ్‌సిరీస్ విడుదలైన కొన్ని రోజుల్లోనే కోట్లాది వీక్షణలు వచ్చాయి. అంతేకాదు నెట్‌ఫ్లిక్స్‌లో అత్యంత వేగంగా వ్యూస్ సొంతం చేసుకున్న వెబ్‌సిరీస్‌గా స్విడ్ గేమ్ సీజన్ -2 రికార్డు(Squid Game 2025) సృష్టించింది. ఇందులో చూసుకుంటే అందులో నటించేవారు ఆకుపచ్చ దూస్తుల్లో కనిపిస్తారు. వివిధ గేమ్స్ ఆడుతుంటారు. అందులో ఓడిపోయిన వారిని పింక్ డ్రెస్‌లో ఉన్న షూటర్స్ చంపేస్తారు. అలాగే బ్లాక్ కోట్, మాస్క్‌తో ఉన్న ఓ వ్యక్తి ఆధ్వర్యంలోనే ఈ గేమ్స్ జరుగుతాయి. అందులో ఓడిపోయిన వారిని షూటర్స్ చంపేస్తుంటే ఓ రూంలో కూర్చోని అతడు ఆస్వాదిస్తుంటాడు. ఈ వెబ్ సిరీస్ చూస్తున్నంత సేపు థ్రిల్లింగ్ ఫీలింగ్ కలుగుతుంది.
Also Read: అవినీతిని ప్రశ్నించాడని సర్పంచ్‌ను చంపించిన మంత్రి.. అతను అరెస్ట్!
అయితే ఈ వెబ్‌సిరీస్‌లోని పాత్రల లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సాయంతో టాప్ పొలిటికల్ లీడర్లు ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీనడ్డా, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, మహువా మొయిత్రా తదితర నేతలు గ్రీన్‌సూట్‌లో పార్లమెంటుకు వస్తున్నట్లు.. సమావేశాల్లో పాల్గొని మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది. అలాగే స్పీకర్ ఓం బిర్లా కూడా బ్లాక్ డ్రెస్‌లో కనిపించారు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు బాగుందంటూ తమ అభిప్రాయాలు చెబుతున్నారు.
Also Read: స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించలేం
నెట్‌ఫ్సిక్స్ ర్యాంకింగ్స్‌లో నెంబర్ 1 (Netflix Web Series Squid Game Season 2)
ఇదిలాఉండగా.. 2021లో విడుదలైన స్విడ్‌గేమ్- సీజన్1 సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 2024 డిసెంబర్ 21న స్క్విడ్ గేమ్ సీజన్-2 విడుదలైంది(Squid Game Season 2 Release). ఇది విడుదలైన మొదటివారంలోనే 68 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. 92 దేశాల్లో నెట్‌ఫ్సిక్స్ ర్యాంకింగ్స్‌లో ఇది నెంబర్ 1 స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు మేకర్స్ మూడో సీజన్‌ను కూడా షూట్ చేస్తున్నారు. ఈ ఏడాదిలోనే సీజన్-3 విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు.
Also Read: USA: ఒకవైపు మంచు తుఫాను..మరోవైపు కార్చిచ్చు..అల్లాడిపోతున్న అమెరికా
Also Read: Cricketer Divorce: విడాకులకు సిద్ధమైన మరో టీమిండియా క్రికెటర్