/rtv/media/media_files/2025/04/14/ztZvdrnDUlsjCNtkDFgx.jpg)
Rare Golconda blue diamond with royal ties heads to auction in Geneva
భారతదేశ రాజుల వద్ద 'గోల్కొండ బ్లూ' అనే అరుదైన వజ్రం ఉండేది. ఇండోర్, బరోడా మహారాజుల వద్ద ఒకప్పుడు ఇది విలువైన సంపదలో ఒకటి. అయితే ఈ వజ్రాన్ని వేలం వేసేందుకు సన్నాహాలు జరుగతున్నాయి. 23.24 క్యారెట్ల ఈ విలువైన వజ్రాన్ని మే 14న స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరిగే ''క్రిస్టీస్ మాగ్నిఫిసెంట్ జ్యువెల్స్’’ సేల్‌లో వేలం వేయనున్నారు. ఈ విషయాన్ని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వేలంలో దీని ధర దాదాపు రూ.430 కోట్ల వరకు పలికే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: వర్షిణి నువ్వొక ఆడదానివైతే.. అఘోరీ మొదటి భార్య సంచలన సవాల్
Also Read : రవితేజ ‘మాస్ జాతర’ నుంచి వచ్చేసిన మాస్ సాంగ్.. చూపుల్తో గుచ్చి గుచ్చి.. మ్యూజిక్, స్టెప్స్‌తో అదిరిపోయాయిగా!
Golkonda Blue Diamond With Royal Ties
రాజ వారసత్వం, అసాధారణమైన రంగు, పరిణామంతో ఈ గోల్కొండ బ్లూ వజ్రం.. ప్రపంచంలోనే అరుదైన నీలి వజ్రాలలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ వజ్రం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా కొల్లూరులో దొరికినట్లు తెలుస్తోంది. పూర్వకాలంలో ఇండోర్‌ను పరిపాలించిన మహారాజా యశ్వంత్ రావు హోల్కర్ 2 వద్ద ఈ వజ్రం ఉండేది. 1923లో మహారాజా తండ్రి దీన్ని ఓ బ్రాస్‌లెట్లో పొదిగించారు.
Also Read: అయ్యప్ప భక్తులకు శుభవార్త.. అందరికి బంగారు లాకెట్లు!
ఆ తర్వాత ఈ ఆభరణాలను రీడిజైన్ చేయడంలో భాగంగా ఇండోర్ పియర్ వజ్రాలతో చేసిన నెక్లెస్‌లో '' ది గోల్కొండ బ్లూ'ను అమర్చారు. ఫ్రెంచ్ చిత్రకారుడైన బెర్నార్డ్ బౌటెట్ డి మోన్వెల్ అప్పట్లో గీసిన ఇండోర్ మహారాణి చిత్రపటంలో ఆమె ధరించిన ఆభరణాల్లో ఈ వజ్రం కూడా ఉన్నట్లు సమాచారం. ఇదిలాఉండగా1947లో ఈ వజ్రాన్ని న్యూయార్క్ ఆభరణాల వ్యాపారి హ్యారీ విన్స్టన్ ఈ వజ్రాన్ని కొనుగోలు చేశాడు. ఆ తర్వాత అది బరోడా మహారాజు వద్దకు వెళ్లింది. ఆ తర్వాత దీన్ని ఓ ప్రైవేటు సంస్థ సొంతం చేసుకుంది.
Also Read : అయ్యప్ప భక్తులకు శుభవార్త.. అందరికి బంగారు లాకెట్లు!
telugu-news | national news in Telugu | latest-telugu-news | today-news-in-telugu | international news in telugu