వీడ్ని పట్టుకుంటే రూ.లక్ష మీ సొంతం.. పోలీసుల సంచలన ప్రకటన

పూణేలో ఆగి ఉన్న బస్సులో మహిళపై అత్యాచారం చేసిన ఘటన సంచలనం రేపుతోంది. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు దత్తాత్రయ రామ్‌దాస్‌ను పట్టించిన వాళ్లకి రూ.లక్ష నగదు బహుమానం ఇస్తామని పోలీసులు ప్రకటించారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
olice announce Rs 1 lakh reward for those giving info on accused

olice announce Rs 1 lakh reward for those giving info on accused

మహారాష్ట్రలోని పూణేలో ఆగి ఉన్న బస్సులో మహిళపై అత్యాచారం చేసిన ఘటన సంచలనం రేపుతోంది. ఈ ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయడంలో పోలీసులు రంగంలోకి దిగారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు దత్తాత్రయ రామ్‌దాస్‌ గాడే కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పోలీసులు కీలక ప్రకటన చేశారు. నిందితుడిని ఎవరైనా పట్టిస్తే వాళ్లకి రూ.లక్ష నగదు అందిస్తామని ఆఫర్ ప్రకటించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు మాస్క్‌ వేసుకొని తప్పించుకు తిరుగుతున్నాడని.. అతడిని పట్టుకునేందుకు డాగ్ స్క్వాడ్‌ను కూడా రంగంలోకి దింపినట్లు పోలీసులు తెలిపారు.  

Also Read: కోమాలో భారతీయ విద్యార్థిని.. తండ్రి అత్యవసర ప్రయాణం కోసం కేంద్రం సాయం!

ఇక వివరాల్లోకి వెళ్తే.. పూణేలోని ఔంధ్ బనేర్‌ ప్రాంతంలో ఉండే 26 ఏళ్ల మహిళ ఓ ఆస్పత్రిలో కౌన్సెలర్‌గా విధులు నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 25న ఉదయం 6 గంటల సమయంలో స్వర్గేట్‌ బస్టాండ్‌కు వచ్చింది. అయితే ఆమె వద్దకు ఓ వ్యక్తి వచ్చాడు. ఆమె ఎక్కాల్సిన బస్సు మరో ప్లాట్‌ఫామ్‌ వద్ద ఉందని చెప్పాడు. ఇది నమ్మిన మహిళ అతడి వెంట వెళ్లింది. ఎవరూ లేని చీకటి ప్రదేశంలో పార్కు చేసిన బస్సు వద్దకు ఆమెను తీసుకెళ్లాడు. ప్రయాణికులు ఎవరూ లేరని ఆమె అడగ్గా బస్సు లోపల కూర్చున్నారని అతడు చెప్పాడు. ఆమె బస్సులోకి వెళ్లగానే అతడు కూడా ఎక్కి డోర్‌ లాక్‌ చేశాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఘటన జరిగిన అనంతరం ఆమె పోలీసులకు చెప్పేందుకు బయపడింది. చివరికీ ఈ విషయాన్ని తన స్నేహితురాలికి చెప్పింది.    

ఆమె సాయంతో స్వర్గేట్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడిని దత్తాత్రామ్‌ రామ్‌దాస్‌ గడేగా గుర్తించారు. అంతేకాదు శిక్రపూర్, శిరూర్‌ పోలీస్‌ స్టేషన్లలో అతడిపై దొంగతనం కేసులున్నట్లు కూడా చెప్పారు. మరోవైపు దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ కూడా పూణే పోలీసులకు ఆదేశించారు. 

Also Read: హిందీ వల్ల 25 నార్త్ ఇండియా భాషలు నాశనమయ్యాయి: స్టాలిన్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

DRDO: భారత అమ్ములపోదిలో మరో అస్త్రం..లేజర్ వెపన్

భారత ఆయుధాల లిస్ట్ లో మరో కొత్త అస్త్రం చేరనుంది. లేజర్ ఆధారిత వెపన్ ను డీఆర్డీవో మొదటిసారి విజయవంతంగా పరీక్షించింది. గాల్లో ఎగురుతున్న యూవీఏ, డ్రోన్లను ఇది పడగొట్టగలదు. 

New Update
india

Laser Weapon

భారత దేశానికి చెందిన డీఆర్డీవో మరో కొత్త ప్రయోగం చేసింది. భారతదేశానికి కొత్త అస్త్రాన్ని అందించింది. అధిక శక్తి కలిగిన లేజర్ ఆధారిత ఆయుధాన్ని డీఆర్డీవో మొదటిసారి పరీక్షించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో నిర్వహించిన ట్రయల్స్‌లో భాగంగా గాల్లో ఎగురుతున్న యూఏవీ, డ్రోన్లను నేలకూల్చడంలో సఫలమైంది. దీనికి సంబంధించిన  వీడియోను ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది. ఒక వాహనంలో ఈ లేజర్ ఎనర్జీని వెపన్ ను అమర్చారు. దీనికి ఎంకే 2(ఏ) ల్యాండ్ వెర్షన్ అని పేరు పెట్టారు. ఇది యూఏవీ, డ్రోన్‌లను విజయవంతంగా అడ్డుకుంది. వాటిని కూల్చడంతో పాటు నిఘా సెన్సార్‌లను పనిచేయకుండా చేసింది. దీనిద్వారా.. లేజర్ డీఈడబ్ల్యూ వ్యవస్థను కలిగి ఉన్న దేశాల సరసన భారత్‌ చేరిందని డీఆర్డీవో తన ట్వీట్ లో రాసింది. అయితే ఇది కేవలం ప్రారంభమైనని..ఇలాంటివి మరిన్ని డీఆర్డీవో తయరాు చేసేందుకు సిద్ధంగా ఉందని డీఆర్డీవో ఛైర్మన్‌ సమీర్‌ వి.కామత్‌ చెప్పారు. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే ఇలాంటి ఆయుధాలను ప్రదర్శించాయి. ఇజ్రాయెల్ కూడా పని చేస్తోందని..మనది నాలుగో దేశమని ఆయన అన్నారు. 

 

 today-latest-news-in-telugu | army

 

Also Read: సన్‌రైజర్స్ Vs కింగ్స్ మ్యాచ్.. ఈ అద్భుతాలు చూశారా..? అస్సలు ఊహించలేరు!

Advertisment
Advertisment
Advertisment