ఢిల్లీకి చెందిన ఓ యువతి హరియాణా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ లాల్ బడోలీ, గాయకుడు రాకీ మిట్టల్ అకా జై భగవాన్‌పై గ్యాంగ్ రేప్ ఫిర్యాదు చేసింది. హిమాచల్ ప్రదేశ్‌లో కసౌలీకి తన స్నేహితురాలితో కలిసి వెళ్ళానని...అక్కడ ఓ హోటల్‌లో బడోలీ, మిట్టల్ కలిశారని చెప్పింది.
ప్రలోభపెట్టి...మద్యం తాగించి..
తనకు నటిగా మారే అవకాశం ఇస్తానని...తను తీయబోయే ఆల్బమ్‌లో అవకాశం ఇస్తానని గాయకుడు రాకీ చెప్పారు. అలాగే మోహన్ లాల్ కూడా తను సీనియర్ రాజకీయ నాయకుడని, తనకు పెద్ద స్థాయిలో పరిచయాలు ఉన్నాయని, ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని ప్రలోభపెట్టారు. ఆ తరువాత తనకు, తన స్నేహితురాలకి బాగా మద్యం తాగించారు. అనంతరం స్నేహితురాలిని భయపెట్టి పక్కకు తీసుకెళ్ళారు. ఆ తరువాత తనపై ఇద్దరూ కలిసి అఘాయిత్యం చేశారని యువతి చెప్పింది. ఈ విషయం ఎక్కడైనా చెబితే చంపేస్తామని బెతిరించారు. దాంతో పాటూ తనను నగ్నంగా ఫోటోలు తీసి, వీడియోలు తీసుకున్నారు. అందుకే ఇన్నాళ్ళు కంప్లైంట్ చేయలేకపోయానని ఫిర్యాదులో చెప్పింది.
యువతి కంప్లైంట్ మేరకు పోలీసులు బడోలీ, మిట్టల్ మీద కేసు నమోదు చేశారు. సెక్షన్ 376డి, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని సోలన్ ఎస్పీ గౌరవ్ తెలిపారు. అయితే ఇంత వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని...కేసును దర్యాప్తు చేసి...నిజానిజాలు తెలుసుకున్న తరువాతనే అరెస్ట్ చేస్తామని చెప్పారు.
Also Read: Olympics Medals: మనుబాకర్ పతకాలు కూడా వెనక్కు...పూత పోతోంది