Kannada Actress Ranya Rao: రన్యా రావు ఒంటి పై గాయాలు..అసలేమైంది!

కన్నడ నటి రన్యారావుకు చెందిన ఒక ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆ ఫొటోలో ఆమె ఒంటిపై గాయాలు ఉన్నట్లు స్పష్టంగా కనపడుతోంది.ఆమెపై అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

New Update

బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో దొరికిన కన్నడ నటి రన్యారావుకు చెందిన ఒక ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఆమె డీఆర్‌ఐ కస్టడీలో ఉంది. డైరెక్టరేట్ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు ఆమెను విచారిస్తున్నారు. ఆమె దగ్గర నుంచి భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

AlsoRead:Telangana Crime: కుటుంబ కలహాలతో తల్లిని నరికి చంపిన కొడుకు

అలాగే ఈ కేసు గురించి అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆమెపై అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారా? లేదంటే ఇంకేమైనా చేశారా? తెలియదు గానీ.. ఆమె ఒంటిపై గాయాలు ఉన్నట్లు స్పష్టంగా కనపడుతోంది.

రన్యారావు కంటి కింద గాయాలైనట్లు ఒక ఫొటో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అయితే దీనిపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆమెను అధికారులు ఏం చేశారంటూ నిలదీస్తున్నారు. ఆమెకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కర్ణాటక మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నాగలక్ష్మి చౌదరి హామీ ఇచ్చారు.

Also Read: Trump-Musk-Rubio: ట్రంప్‌ క్యాబినెట్‌ మీటింగ్‌ లో గొడవ పడ్డ మస్క్‌..రూబియె

మార్చి 3న బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్యారావును డీఆర్‌ఐ అధికారులు తనిఖీ చేయగా.. రూ.12 కోట్ల విలువైన 14.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. దుబాయ్ నుంచి ఇలా పలుమార్లు బంగారం స్మగ్లింగ్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. ఆమె ఇంటిని సోదా చేయగా.. అక్కడ కూడా కోట్ల విలువైన బంగారాన్ని గుర్తించినట్లుగా సమాచారం. జనవరి నుంచి మార్చి 3 వరకు దాదాపు 27 సార్లు దుబాయ్ వెళ్లి వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. తన తండ్రి హోదాను అడ్డంపెట్టుకుని.. ఒక కానిస్టేబుల్ సాయంతో ఎలాంటి తనిఖీలు లేకుండా ఎయిర్‌పోర్టులో ఆమె కథ నడిపించినట్లుగా తెలుస్తోంది. బంగారం బిస్కెట్లు.. తొడలకు స్టిక్కర్లతో అంటించుకుని బయటకు వచ్చేసేదని సమాచారం. అయితే ఆమె వెనుక బలమైన రాజకీయ శక్తులు ఉన్నట్లుగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానిస్తు్న్నారు.


ఆమె దుబాయ్‌కు మాత్రమే కాకుండా యూరప్‌, సౌదీ అరేబియా, అమెరికా, పశ్చిమాసియా దేశాల నుంచి కూడా బంగారం స్మగ్లింగ్ చేసినట్లుగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ తెలిపింది. ఈ విషయాలు ఆమెనే చెప్పినట్లుగా అధికారులు తెలిపారు. అయితే ఈ విషయాలను రహస్యంగా ఉంచాలని ఆమె అధికారులను కోరినట్లు తెలుస్తోంది. తనకు కొంత విశ్రాంతి ఇవ్వాలని.. ఎప్పుడు విచారణకు రమ్మంటే అప్పుడు వస్తానని చెప్పినట్లుగా సమాచారం.

Also Read:Air India: వీల్‌ఛైర్ లేదన్న ఎయిరిండియా.. ఐసీయూలో వృద్ధురాలు

Also Read: Syria:సిరియాలో పోలీసుల మృతితో ప్రభుత్వం రివేంజ్.. అసద్ గ్యాంగ్ లో 200 మంది మృతి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు