Raghav Chadha : దెబ్బ మీద దెబ్బ..  రాఘవ్ చద్దాకు ఆప్ బిగ్ షాక్

రాఘవ్ చద్దాని తొలగించిన కొద్ది రోజులకే, పంజాబ్ ప్రభుత్వం ఆయనకు మరో షాక్ ఇచ్చింది. ఎంపీ రాఘవ్ చద్దానీకి ఇప్పటివరకు ఉన్న 'Z+' కేటగిరీ భద్రతను ఉపసంహరించుకుంటున్నట్లు పంజాబ్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

New Update
raghav

రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ(aam-admi-party) (ఆప్) డెప్యూటీ లీడర్ పదవి నుంచి రాఘవ్ చద్దా(raghav-chadha) ని తొలగించిన కొద్ది రోజులకే, పంజాబ్ ప్రభుత్వం ఆయనకు మరో షాక్ ఇచ్చింది. ఎంపీ రాఘవ్ చద్దానీకి ఇప్పటివరకు ఉన్న 'Z+' కేటగిరీ భద్రతను ఉపసంహరించుకుంటున్నట్లు పంజాబ్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. 37 ఏళ్ల వయసున్న చద్దా రక్షణ కోసం ఇప్పటివరకు పనిచేస్తున్న పంజాబ్(punjab) పోలీసు అధికారులను, సిబ్బందిని వెంటనే హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి.

Also Read:  రెస్టారెంట్‌లో భోజనం.. లాటరీలో పికాసో పెయింటింగ్: భలే కొట్టాడురా ఛాన్స్!

కొంతకాలంగా విభేదాలు

ఆమ్ ఆద్మీ పార్టీకి, పంజాబ్ ఎంపీ రాఘవ్ చద్దాకు మధ్య గత కొంతకాలంగా విభేదాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. పార్లమెంటులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం ఎత్తడానికి చద్దా వెనకాడుతున్నారని పార్టీ నాయకత్వం ఆగ్రహంగా ఉంది. ప్రజా సమస్యల కంటే వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునే 'సాఫ్ట్ పీఆర్' పనులకే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపిస్తూ, ఏప్రిల్ 2వ తేదీన ఆయన్ని రాజ్యసభ డెప్యూటీ లీడర్ పదవి నుంచి పార్టీ తొలగించింది.

అయితే పార్టీ చేస్తున్న ఈ ఆరోపణలను రాఘవ్ చద్దా తీవ్రంగా ఖండించారు. తనపై వస్తున్నవన్నీ అబద్ధాలని ఆయన కొట్టిపారేశారు. తాను పార్లమెంటుకు వెళ్లేది ప్రజల సమస్యలను వినిపించడానికి మాత్రమేనని, అక్కడ అనవసరంగా రభస సృష్టించడానికి కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ వరుస పరిణామాలతో ఆప్ అధిష్టానానికి, చద్దాకు మధ్య ఉన్న గ్యాప్ మరింత పెరిగినట్లు కనిపిస్తోంది.

Also Read :  180 మంది మైనర్ బాలికలపై లైంగిక వేధింపులు.. 350 వీడియోలు

Advertisment
తాజా కథనాలు