/rtv/media/media_files/2026/04/05/raghav-chadha-2026-04-05-15-21-50.jpg)
Raghav Chadha Hits Back After AAP Claims He Didn't Raise Punjab Issues
రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP(aam-admi-party)) డిప్యూటీ లీడర్‌గా రాఘవ్ చడ్డా(raghav-chadha) ను తొలగించడం దుమారం రేపుతోంది. దీనిపా తాజాగా ఆయన మరోసారి స్పందించారు. పంజాబ్ సమస్యల పట్ల పార్లమెంట్‌లో ఆయన మౌనంగా ఉన్నారని పార్టీ చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఎక్స్ వేదికగా ఓ వీడియోను విడుదల రిలీజ్ చేశారు. పంజాబ్ కేవలం తనకు రాజకీయం కాదని.. అది తన ఆత్మ, ఇల్లు, విధి అంటూ వ్యాఖ్యానించారు. పార్టీలో ఉన్న కొందరు మిత్రులే తనపై కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
Raghav Chadha Hits Back After AAP Claims
పంజాబ్ ప్రయోజనాల కోసం తాను నిరంతరం పోరాడానంటూ రాఘవ్ చడ్డా గుర్తుచేశారు. రైతులకు కనీస మద్దతు ధర (MSP) ఇవ్వడం, నన్‌కనా సాహిబ్ కారిడార్ అంశం, రాష్ట్రంలో తగ్గిపోతున్న భూగర్భ జలాలు, భగత్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్లపై తాను పార్లమెంటులో గళం విప్పానంటూ పేర్కొన్నారు. తాను ఫెయిలయ్యానంటూ విమర్శిస్తున్న వాళ్లకి ఈ వాస్తవాలే సమాధానం చెబుతాయన్నారు. తనను టార్గెట్ చేయడం వెనకున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.
Also Read: విజయ్ అఫిడవిట్‌లో తప్పులు.. ఆస్తులు, వయస్సు, కేసులు అన్ని తప్పే!
మరోవైపు పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. తన పోరాటం ఇక్కడితో ఆగిపోలదన్నారు. ఇక వీడియో చివర్లో "సినిమా ఇంకా మిగిలే ఉంది మిత్రమా'' అంటూ హిందీ డైలాగ్‌తో కౌంటర్ ఇచ్చారు. దీన్నిబట్టి ఇప్పుడు తాను రిలీజ్ చేసింది కేవలం చిన్న 'ట్రైలర్' మాత్రమేనని.. ఇక రాబోయే రోజుల్లో తన కార్యాచరణ ఇంకా బలంగా ఉంటుందనే సంకేతాలిచ్చారు. ఇటీవల పార్లమెంటులో రాఘవ్ చడ్డా లేవనెత్తిన సమస్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజన్లు ఆయన్ని ప్రశంసిస్తున్నారు. అలాగే డిప్యూటీ లీడర్‌గా ఆప్ ఆయన్ని తొలగించడాన్ని ఖండిస్తున్నారు.
Follow Us